యాదవ యుద్ధభేరికి రావాలని రేవంత్ ను ఆహ్వానించిన యాదవ విద్యావంతుల వేదిక అధ్యక్షులు చలకాని.వెంకట్ యాదవ్ మరియు కమిటీ
సాక్షిత :రాజకీయ పార్టీలు యాదవులకు ప్రాముఖ్యత ఇవ్వాలి : యాదవ విద్యా వంతుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు, టీపీసీసీ సభ్యులు నాగా సీతారాములు యాదవ్ …….
రాష్ట్రంలో యాదవులకు అన్ని రాజకీయ పార్టీలు 22ఎమ్మెల్యే, 7ఎమ్మెల్సీ, 3లోకసభ, 2 రాజ్యసభ టికెట్లు ఇవ్వాలనే నినాదంతో 25వతారీఖున నిర్వహించబోయే యాదవ యుద్ధ భేరి సభకు రేవంత్ రెడ్డిని ఆహ్వానించేందుకు వెళ్ళారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతు యాదవులకు రాజకీయ పార్టీలు సరైన గుర్తింపు ఇవ్వడం లేదన్నారు. రాజకీయాల్లో యాదవులకు ప్రాముఖ్యత ఇచ్చేలా అన్ని పార్టీలు రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో యాదవులుకు 22 ఎమ్మెల్యే టికెట్లు,7ఎమ్మెల్సీలు, 3 లోక్ సభ, 2 రాజ్యసభ టికెట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
యాదవ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రాష్ట్ర బడ్జెట్‌లో 18శాతం నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. హక్కులు, డిమాండ్ల సాధనకు యాదవ సోదరులందరు సమిష్టిగా ముందుకు సాగాలన్నారు. రాజ్యాధికారం సాధించెంత వరకు పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ ఆహ్వాన కార్యక్రమంలో అఖిల భారత యాదవ మహాసభ నేషనల్ జనరల్ సెక్రెటరీ ఆర్.లక్ష్మణ్ యాదవ్, టిపిసిసి ఉపాధ్యక్షులు తోటకూర.జంగయ్య యాదవ్, జనరల్ సెక్రెటరీ బీర్ల ఐలయ్య యాదవ్, గజ్జి.బాష్కర్ యాదవ్, తాండ్ర.శ్రీనివాస్ యాదవ్, రఘురాం యాదవ్,మంజులత యాదవ్,లలితకుమారి యాదవ్, యాదవ విద్యావంతుల వేదిక ముఖ్య నాయకులు పాల్గొన్నారు.