SAKSHITHA NEWS

జములమ్మ గుడికి దారి వదలాలని కాలనీవాసుల దీక్ష*మద్దతు తెలిపిన రాజకీయపార్టీలు
ఎమ్మెల్యే హామీతో దీక్ష విరమణ
సాక్షిత వనపర్తి : వనపర్తి పట్టణ కేంద్రంలో మున్సిపాలిటీ వెనక ల ఉన్న జమ్ములమ్మ గుడికి దారి వదలాలని అదే కాలనీకి చెందిన ప్రజలు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట దీక్ష చేపట్టారు బిజెపి కాంగ్రెస్ పార్టీ లతోపాటు ఇతర పార్టీలు పార్టీలకు సంబంధం లేకుండ దీక్ష శిబిరానికి చేరుకొని మద్దతు తెలిపారు దీక్ష శిబిరాన్ని ఉద్దేశించి దీక్ష చేపట్టినకాలనీవాసులు మెకానిక్ శ్రీను సింగోటం బచ్చు రాము లు మాట్లాడుతూ పట్టణం పుట్టినప్పటి నుండి జమ్ములమ్మ గుడి ఇదే కాలనీలో ఇక్కడే ఉందని ప్రతి సంవత్సరం మృగశిర కార్తిలో పట్టణ వ్యాప్తంగా ఉన్న భక్తులు గుడి వద్దకు వచ్చి గుడి ముందు ఖాళీ స్థలంలో వంటలు వండుకుని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి న తర్వాత భక్తులు వారి కుటుంబ సభ్యులతో కలిసి ఇక్కడే భోంచేసుకుని వెళ్తుంటారని భక్తులు రావడానికి పోవడానికి మున్సిపాలిటీ ఎదురుగా ఒకదారి వల్లబ్ నగర్ కాలనీ నుండి మరో దారి ఉన్నదని కానీ కొత్తగా జిల్లా ఏర్పడిన సమయంలో మున్సిపాలిటీ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ కార్యాలయం అందులోనే కొనసాగిందని

ఆ సమయంలో పోలీసు ఉన్నతాధికారులు కార్యాలయ రక్షణ కోసం కాలనీవాసులతో చర్చించి తమ పోలీస్ కార్యాలయ సొంత భవనం పూర్తి అయ్యే వరకు మున్సిపల్ కార్యాలయం ఎదుట ఉన్న దారిని మూయించడం జరిగిందని ఆ తర్వాత పోలీస్ కార్యాలయము సొంత భవనంలోకి మారడం ఆ తర్వాత మున్సిపాలిటీ కార్యాలయం అందులోకి మార్చడం జరిగిపోయింది ఆ తర్వాత మున్సి,పాలకులను , అధికారులను గుడికి దారి వదలాలని పలుమార్లు కోరగా ఆ దారి మున్సిపాలిటీ వాస్తు సరిగ్గా లేదని దారి వదలడం కుదరదని తేల్చి చెప్పడం జరిగిందని అప్పటినుండి రాజకీయ నాయకుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితం లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


జమ్ములమ్మ గుడి దారి కిఅడ్డుగా కాలనీ కి చెందిన ఓ ప్రజాప్రతినిధులే కారణమా …….. మున్సిపాలిటీకి ఎదురుగా ఉన్న దారికి ఉన్న మరో దారి కి ఎదురుగా అదే కాలనీ 23వ వార్డుకు చెందిన ప్రజాప్రతినిధులు ఇల్లు ఉండడంతో ఆ ప్రజా ప్రతినిధి తన ఇంటి కి వీధి పోటు అవుతుంది అనే నేపంతో గత మున్సిపాలకులతో కలిసి ఆ దారిని ఆ నాయకుడి పోద్బలంతోనే తెరవనీయకుండా చేశాడని కాలనీవాసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అందుకే దారి వదిలేందుకు కాలయాపన జరిగిందని స్థానిక నాయకులు స్పందించి సమస్యను పరిష్కరించకపోతే కాలనీ వాసులతో కలిసి గుడి కమిటీ సభ్యులు పార్టీలకతీతంగా పోరాటాలు చేస్తామని తెలిపారు
ఎమ్మెల్యే హామీతో దీక్షా విరమణ
జమ్మలమ్మ గుడి దారి కోసం కాలనీవాసులు చేస్తున్న దీక్ష విషయాన్ని తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే తూడి మెగా రెడ్డి నెల రోజుల్లో జములమ్మ గుడి కి దారి వదలడం మే కాకుండా సీసీ రోడ్డు కు కృషి చేస్తానని ఫోన్లో హామీ ఇవ్వడంతో దీక్షను విరమించడం జరిగింది.


SAKSHITHA NEWS