The people of Kalvakurti look towards the BSR state leaders Goli Srinivasa Reddy.
కల్వకుర్తి ప్రజల చూపు బి ఎస్ ఆర్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాసరెడ్డి వైపు.
గోలి శ్రీనివాస్ రెడ్డి జీవితం ప్రజాసేవకు అంకితం. చిన్న చిన్న సేవలు చేసుకొని చెప్పుకునే ఈ కాలంలో ఎన్నో సేవలు చేస్తూ రాజకీయంగా మంచి భవిష్యత్తు. రాజకీయంలో ఉన్నత పదవులు ఇస్తానన్న తీసుకోకుండా ప్రజలే నా జీవితం ప్రజాసేవయే నా లక్ష్యం అంటూ ప్రజాసేవ చేసుకుంటూ వెళుతున్న టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి.
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం ఆమనగల్ మున్సిపాలిటీ నారాయణపురం గ్రామానికి చెందిన టిఆర్ఎస్ రాష్ట్ర సీనియర్ నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి జీవితం ప్రజాసేవకే అంకితమని కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు అంటున్నారు.
ఉద్యమంలో చేరిన నాటి నుండి ప్రజలకు తన వంతుగా సేవ చేస్తూ నియోజకవర్గం సేవా మార్గంలో ముందుకు దూసుకుపోతున్నాడు గోలి శ్రీనివాస్ రెడ్డి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుండి నేటి వరకు ప్రజాసేవని మార్గంగా ఎంచుకుని ప్రజల్లోకి వెళుతున్నాడు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో ఉన్న ఎనాడు పదవి ఆశించని నేతగా ప్రజల్లో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈసారి జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నాడు గోలి శ్రీనివాస్ రెడ్డి. అధిష్టానం ఏం చెబుతుందో ఏం చేస్తుందో అప్పటివరకు వేచి చూడాల్సిందే అనికల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు అంటున్నారు.
తెలంగాణ ఉద్యమం మొదలు అయినప్పటి నుండి కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉంటూ, ప్రజలకు ఎన్నో ఇబ్బందులలో ఉన్న తన వంతు సహాయం అందించిన మొట్టమొదటి వ్యక్తి గోలి శ్రీనివాస్ రెడ్డి. కల్వకుర్తి నియోజకవర్గం లో విస్తృత పర్యటనలు చేస్తూ టిఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు తన వంతు తోడ్పాటు అందిస్తూ, తన వంతు కృషి చేస్తూ ప్రజలతో మమేకమవుతూ తనకంటూ ప్రజల గుండెల్లో స్థానం సంపాదించుకున్నాడు గోలి శ్రీనివాస్ రెడ్డి.
తనకంటూ ఏమి ఆశించకుండా ప్రజలకు సేవ చేస్తున్న నిస్వార్థ రాజకీయ నాయకుడు గోలి శ్రీనివాస్ రెడ్డి కల్వకుర్తి నియోజకవర్గం లో స్వార్థం లేని రాజకీయ నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. అలాంటి నేతకు అధిష్టానం తన సేవలను గుర్తించి ఖచ్చితంగా ఈసారి 2023లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలలో అధిష్టానం గోలి శ్రీనివాస్ రెడ్డి కె అసెంబ్లీ టికెట్ కేటాయిస్తుందని ప్రజలు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఒక్కసారైనా గోలి శ్రీనివాస్ రెడ్డిని ఎమ్మెల్యేగా చూడాలని కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలు కళ్ళకు ఒత్తులు వేసుకొని వేచి చూస్తున్నారు దీంతో కచ్చితంగా గోలి శ్రీనివాస్ రెడ్డికే ఈసారి అసెంబ్లీ టికెట్ కేటాయించాలని ప్రజలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నారు.