The ongoing investigation into the death of a three-month-old boy
మూడు నెలల బాలుడు మృతి పై కొనసాగుతున్న విచారణ..*
విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు
బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించిన మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్యదేవేందర్ యాదవ్.. కౌన్సిలర్లు
రంగా రెడ్డి జిల్లా సాక్షిత ప్రతినిధి
తిమ్మాపూర్ వ్యాక్సినేషన్ సెంటర్లో వ్యాక్సిన్ వికటించి కుమ్మరిగూడ గ్రామానికి చెందిన మూడు నెలల బాలుడు రుత్విక్ మృతి చెందాడనే ఆరోపణలపై అధికారులు పూర్తి విచారణ చేపట్టారని మున్సిపల్ చైర్ పర్సన్ లావణ్య దేవేందర్ యాదవ్ అన్నారు… మంగళవారం కుమ్మరిగూడ గ్రామానికి వెళ్లిన ఆయన కౌన్సిలర్లతోపాటు కలిసి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విచారణ అనంతరం బాధ్యులపై కఠిన చర్యలు ఉంటాయని బాధిత కుటుంబ సభ్యులకు భరోసానిచ్చారు.. పరామర్శించిన వారిలో కౌన్సిలర్లు కోస్గి శ్రీనివాస్, రాజేందర్ గౌడ్, జయమ్మ జనార్దన్ చారి, ప్రసన్నలతయాదయ్య, నేతలు కుమ్మరి బిక్షపతి, అడ్వకేట్ ప్రవీణ్, శివశంకర్ గౌడ్, ఆంజనేయులు, శ్రీశైలం, బండారి రామకృష్ణ తదితరులు ఉన్నారు…