The objective is to provide better infrastructure
మెరుగైన మౌలిక సదుపాయాల కల్పనే లక్ష్యం…
రూ.17.50 లక్షల వ్యయంతో చేపడుతున్న అంతర్గత సీసీ రోడ్డు పనుల శంఖుస్థాపనలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్
…
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని గణేష్ నగర్ లో రూ.17.50 లక్షల వ్యయంతో నూతనంగా చేపడుతున్న అంతర్గత సీసీ రోడ్డు నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని శంఖుస్థాపన చేశారు.
అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాలనీలను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా పని చేస్తున్నామని చెప్పారు. సమస్యలను ఒక్కొకటిగా అధిగమిస్తూ శాశ్వత పరిష్కారం చూపుతున్నామని అన్నారు. అభివృద్ధి పనులకు నిధుల కొరత లేకుండా ఆదర్శవంతమైన నియోజకవర్గంగా కుత్బుల్లాపూర్ ను తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు.
కాలనీలో మిగిలిన పనులు త్వరలోనే పూర్తి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ బొడ్డు వెంకటేశ్వర రావు, డిఈఈ పాపమ్మ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ యూత్ ప్రెసిడెంట్ సోమేష్ యాదవ్, నాయకులు సత్తిరెడ్డి,
బాలయ్య మరియు కాలనీ అడ్వైజర్లు దుర్గారావు, యాదగిరి, ప్రెసిడెంట్ నరసింహారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ లింగం, వైస్ ప్రెసిడెంట్లు బొట్టు కృష్ణ, వెంకటేష్, జనరల్ సెక్రెటరీ మురళి గౌడ్, జాయింట్ సెక్రటరీ నరసింహ రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీలు రత్నాకర్ రావు, వనం శ్రీనివాస్, హెల్త్ సెక్రటరీ చంద్రమౌళి గౌడ్, ట్రెజరర్ భాస్కర్ గౌడ్, కమిటీ మెంబర్ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.