సాధారణ బదిలీలో భాగంగా కృష్ణా జిల్లాకు నూతనంగా బదిలీపై వచ్చిన ఇన్స్పెక్టర్లు, సబ్ ఇన్స్పెక్టర్లు జిల్లా ఎస్పీ జాషువా ఐపిఎస్ ని మర్యాదపూర్వకంగా కలిసారు. గతంలో గుడివాడ సిసిఎస్ నందు విధులు నిర్వర్తిస్తున్న 2002వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన సిహెచ్ సతీష్ కుమార్ చిలకలపూడి ఇన్స్పెక్టర్గా, 2009 సంవత్సరం బ్యాచ్కు చెందిన కే ఏసు బాబు ఏలూరు ఏసీబీ నుండి గుడివాడ రూరల్ ఇన్స్పెక్టర్గా, 2009వ సంవత్సరం బ్యాచ్ కు చెందిన టి.వి.రమా రావు కౌంటర్ ఇంటెలిజెన్స్ నుండి పెనమలూరు ఇన్స్పెక్టర్గా, 2007 సంవత్సరం కు చెందిన ఎల్ రమేష్ విజయవాడ సిసిఎస్ నుండి అవనిగడ్డ కు, 2002వ సంవత్సరం కు చెందిన సిహెచ్ నాగప్రసాద్ భీమవరం నుండి చల్లపల్లి ఇన్స్పెక్టర్గా, ఎస్ ఎల్ ఆర్ సోమేశ్వరరావు స్పెషల్ బ్రాంచ్-2 ఇన్స్పెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
జిల్లాలో నూతన పోస్టింగులు తీసుకున్న సబ్ ఇన్స్పెక్టర్లయిన 2014 సంవత్సరం బ్యాచ్కు చెందిన జీ రమేష్ తోట్లవల్లూరు నుండి పెనమలూరుకు, 2018 సంవత్సరం బ్యాచ్కు చెందిన పి విశ్వనాధ్ తోట్లవల్లూరు, 2012 సంవత్సరం బ్యాచ్కు చెందిన సిహెచ్ కిషోర్ చిలకలపూడి నుండి పమిడిముక్కలకు, ఎం.మాణిక్యమ్మ ఇనగుదురు పోలీస్ స్టేషన్ నుండి దిశా మహిళా పోలీస్ స్టేషన్ కు కేటాయించడం జరిగింది. వీరందరూ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా ఎస్పీ జాషువా ఐపీఎస్ ని మర్యాదపూర్వకంగా కలిశారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన సిబ్బందిని ఉద్దేశించి ఎస్పీ మాట్లాడుతూ నూతన ప్రదేశంలో నూతన బాధ్యతలను స్వీకరించి శాంతి భద్రతల పరిరక్షణకు, ప్రజా సమస్యల పరిష్కారానికి నేర నియంత్రణకు తమదైన పాత్రను పోషిస్తూ, అవినీతికి తావు లేకుండా అసాంఘిక శక్తులను అణిచివేయడంలో కీలకంగా వ్యవహరించాలని, విధి నిర్వహణలో అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని తెలిపారు