చీమలపాడు బాధితులకు అన్నీ తానైన నామ
క్షతగాత్రులను చూసి చలించి..కన్నీళ్ల పర్యంతమైన నామ
ప్రాణాలు కాపాడాలనే తపన
దగ్గరుండి వైద్య సేవలు
సందీప్ ను కాపాడేందుకు మరింత తాపత్రయం
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఏదైనా జరిగితే నాకెందుకులే ..ఎవరెక్కడ పోతే మనకెందుకనుకుని తప్పించుకు పోయే వారున్న ఈ రోజుల్లో…ఎంపీ నామ నాగేశ్వరరావు చీమలపాడు ఘటన బాధితుల పట్ల చూపిన ఆదరణ, ప్రేమ ప్రశంసలందుకుంటోంది…చీమలపాడు ఘటనలో తీవ్రంగా గాయపడిన వారిని ఆదుకోవడం లోను, క్షతగాత్రుల పట్ల ఎంపీ చూపించిన శ్రద్ద అందర్నీ ఆశ్చర్య చకితుల్ని చేసింది. ఘటన జరిగిన దగ్గర నుంచి బాధితులకు అన్నీ తానయ్యాడు… కుటుంబ సభ్యుడిగా వారిలో కలిసిపోయి, వారికి సేవలందిస్తున్నారు నామ నాగేశ్వరరావు ….ఘటన జరిగిన రోజే ఆయన మనసు కాకా వికలమైంది… ఘటనా స్థలంలోనే చలించిన మనసుతో ఆందోళ చెందారు.
. ప్రభుత్వ ఆస్పత్రి, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారిని , గుండెలవిసెలా విలపిస్తున్న వారి కుటుంబ సభ్యులను, వారి పిల్లలను చూసి నామ నాగేశ్వరరావు ఎంతో చలించిపోయారు …ఒకానొక సందర్భంలో ఆయన కంట కన్నీళ్లు జాలు వారాయి…ఏమిటీ కాల వైపరిత్యమంటూ గుండెల్లో దిగాలు పడ్డారు నామ… క్షతగాత్రులకు మెరుగైన వైద్యమే లక్ష్యంగా నామ అది నుంచి ఆరాట పడుతున్నారు. కలెక్టర్ తోను, వైద్యాధి కారులతోను, రాష్ట్ర ముఖ్యమంత్రి తోను ఒక వైపు మాట్లాడుతూనే మరోవైపు క్షతగాత్రులను ఆదుకునేందుకు ఆయన చేయని ప్రయత్నం లేదు.హైదరాబాద్ తరలించిన సందీప్ ను బతికించేందుకు ఎంపీ నామ నాగేశ్వరరావు చేయని ప్రయత్నం లేదు.. అతని భార్య మామిని, కొడుకు కృష్ణ ఏడ్పులకు నామ మరింత చలించిపోయారు…మాకెవరూ లేరు… ఇక మాకెవరు దిక్కంటూ విలపించడం నామను హృదయంతరాలను కదిలించింది…
అందుకే నామ క్షతగాత్రులకు నేనున్నానని పూర్తి భరోసా ఇచ్చారు…ఆఘమేఘాల మీద రాత్రికి రాత్రే హైదరాబాద్ తరలించేందుకు అంబులెన్స్ లు ఏర్పాటు చేయించడం తో పాటు వారి వెంటే వెళ్లి నిమ్స్ ఆస్పత్రిలో క్షతగాత్రులను చేర్పించడం ఆయనలోని మానవత్వానికి నిలువెత్తు నిదర్శనమని చెప్పవచ్చు.నిమ్స్ లో వైద్యాధికారులతో మాట్లాడి, దగ్గరుండి క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా శ్రమిస్తున్నారు.. అయినా సందీప్ మృత్యువాత పడడం నామను తీవ్రంగా బాధించింది. చేతిలో చిల్లి గవ్వ లేదని సందీప్ భార్య చెప్పగానే నామ వెంటనే ఆమెకు రూ.50 వేలు తీసి, చేతిలో పెట్టిన మానవతావాది నామ నాగేశ్వరరావు….నామ చేసిన అవిరళ కృషి ఫలితంగా మిగతా క్షతగాత్రులకు ప్రాణా పాయం తప్పింది…ఘటన జరిగిన దగ్గర నుంచి క్షతగాత్రులందరి ప్రాణాలు కాపాడడమే లక్ష్యంగా నామ వెంపర్లాడారు… ఇలాంటి బాధ్యత గల మానవతావాది ఎంపీ గా దొరకడం మన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజల అదృష్టమని చెప్పవచ్చు…