నామ నిధులతో గ్రౌండ్ లో వసతులు
నామకు కృతజ్ఞతలు తెలిపిన వాకర్స్
పెవిలియన్ గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారం చేసిన ఎంపీ అభ్యర్థి నామ నాగేశ్వరరావు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత
బీఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్ధి నామ నాగేశ్వరరావు ఉదయం ఖమ్మం లోని పెవిలియన్ గ్రౌండ్ లో వాకర్స్ ను కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వాకర్స్ నుంచి మంచి స్పందన లభించింది. గ్రౌండ్ లో వాకర్స్ కోసం వాకింగ్ ట్రాక్, మంచినీటి పైపు లైన్, పంపు ఏర్పాటు తో పాటు షటిల్ కోర్టు లో వసతులు కల్పించి న నాయకుడు నామ అని వాకర్స్ తెలిపారు.గ్రౌండ్ ను అభివృద్ధి చేసిన నామకు వాకర్స్ క్లబ్ తరపున అధ్యక్షుడు , కార్పొరేటర్ ఆయిన బుడిగం శ్రీనివాస్ అభినందనలు, కృతజ్ఞతలు తెలిపారు.నామ ఇచ్చిన లక్షలాది రూపాయల నిధులతోనే గ్రౌండ్ లో వాకింగ్ ట్రాక్, వాటర్ పైపు లైన్,పంపు, షటిల్ కోర్టు తదితర పనులు చేపట్టినట్లు తెలిపారు.
తప్పని సరిగా ఈ సారి కూడా నామకే ఓటు వేసి గెలిపిస్తామని స్పష్టం చేశారు. అభివృద్ధి ప్రదాతకే తమ ఓటు అని చెప్పారు. ఈ సందర్భంగా గ్రౌండ్ లో వాకింగ్ చేస్తున్న ప్రతి ఒక్కరిని నామ కలిసి ఈ ఎన్నికల్లో తనకే కారు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు.మంచి మెజార్టీతో గెలిపిస్తే అన్ని విధాలా అండగా ఉండి మరింత అభివృద్ధి చేస్తానని చెప్పారు. తెలంగాణా ప్రయోజనాలు కాపాడాలంటే తప్పనిసరిగా బీఆర్ ఎస్ ఎంపీలు గెలవాలన్నారు. పార్లమెంట్ సాక్షిగా ఎన్నో సమస్యలపై గొంతు విప్పి, పోరాడానని చెప్పారు. ప్రతి ఒక్కరూ తన గెలుపునకు కృషి చేసి పార్లమెంట్ కు పంపిస్తే జిల్లాను అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాలో రూ 8 వేల కోట్ల విలువైన జాతీయ రహదారులను తీసుకొచ్చానని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ బుడిగం శ్రీను, కార్యదర్శి వెంకట్, 49వ డివిజన్ మాజీ కార్పొరేటర్ పార్థసారధి, డివిజన్ పార్టీ ప్రెసిడెంట్ మన్యం వెంకట రమణ, భాస్కర రావు, ఉయ్యురు కోటయ్య, జక్కుల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.