SAKSHITHA NEWS

ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ డిమేండ్

కార్మికులకు కనీస నెలవేతనం 26,000 వేలు రూపాయలు ప్రభుత్వం చెల్లించాలి

సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ కార్మికులు చేస్తున్న సమ్మెలో పీసీసీ అధ్యక్షుడు గిడుగురుద్రరాజు ఆదేశాలతో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నేతలు

మున్సిపల్ కార్మికుల డిమేండ్లను సత్వరమే ప్రభుత్వం పరిష్కారించకపోతే మున్సిపల్ శాఖ మాత్యులు ఆదిమలపు సురేష్ ఇంటిని ముట్టడిస్తాం …… మాజీ శాసన సభ్యులు .ఏపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ మస్తాన్ వలి

విజయవాడ. రైల్వే స్టేషన్ : సిఐటియు ఆధ్వర్యంలో మున్సిపల్ అప్కాస్ కార్మికులు వారి డిమేండ్లను ప్రభుత్వం అమలు చేయాలనీ గత కొన్నిరోజులుగా గాంధీనగర్ వేయికల్ డిపో ఎదురుగా అక్కడే భోజనాలు ..టిఫిన్లు వండుకుంటూ ..సీపీఎం ఆధ్వర్యంలో సమ్మె నిర్వహిస్తున్నారు ప్రభుత్వం వారి డిమేండ్లపరిష్కారానికి ఇప్పటివరకు స్పందించక పోవటం శోచనీయం యూనియన్ నాయకులు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ దృష్టికి వారి సమస్యలను తీసుకువచ్చిన వెంటనే పీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు స్పందించి ఏపీ కాంగ్రెస్ పార్టీ తరుపున కార్మికులకు మద్దత్తు తెలుపుతూ శుక్రవారం ఉదయం ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధుల బృందాన్ని మాజీశాసన సభ్యులు ,ఎపి కాంగ్రెస్ కమిటీ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు షేక్ మస్తాన్ వలి నేతృత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు ,ప్రధాన కార్యదర్సులు ,నగర కాంగ్రెస్ కమిటీ నేతలు కార్మికులు సమ్మె చేస్తున్న సభ స్థలానికి వెళ్లి కార్మికులకు అండగా నిలపడాలని ఆదేశాలను జారీచేశారు

…..సభాస్థలికి వెళ్లి కార్మికులకు పరామర్శించి వారి డిమేండ్లను తెలుసుకున్న ఏపీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు షేక్ మస్తాన్ వలి మీడియాతో మాట్లాడుతూ ఏపీ అంతటా వివిధ శాఖలలో విధులు నిర్వహించే ఉద్యోగస్తులు ,అంగనవాడి టీచర్లు ,కార్మికులు అనేకసమస్యలతో కొట్టుమిట్టాడుతూ వారిసమస్యలను పరిష్కరించమని తెలియపరచి నిరోచక్రవర్తిలా ఫిడేలు వాయించుకుంటున్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని విమర్శించారు. మున్సిపల్ కార్మికులు డిమేండ్లను సత్వరమే ప్రభుత్వం పరిష్కరించకపోతే మున్సిపల్ మాత్యులు ఆదిమలుపుసురేష్ ఇంటిని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముట్టడిస్తామని మస్తాన్ వలి అన్నారు. ఈకార్యక్రమములో కార్మికుల విభాగం యూనియన్ నాయకులు ,సిపియం ,సిఐటియు నాయకులు ,రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు వి .గురునాధం,మీసాల రాజేశ్వరావు,ప్రధాన కార్యదర్సులు బైపూడి నాగేశ్వరావు,గంగిశెట్టి ఉమాశంకర్,షేక్ నాగూర్ ,పీవై కిరణ్ ,ఏఐసిసి సభ్యులు షేక్ ఖాజా మొహినుద్దీన్,నగర కాంగ్రెస్ ఉపాధ్యక్షులు షేక్ అబ్దుల్లా,సిటీ యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు రాణి మేకల సతీష్ , ప్రవీణ్,తదితరులు పాల్గొన్నారు

WhatsApp Image 2023 12 29 at 4.56.05 PM

SAKSHITHA NEWS