SAKSHITHA NEWS

డ్రైవర్లకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన మోటార్ వెహికల్ ఆక్ట్ 2024 ఎత్తివేయ్యాలి.
ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు యూసుఫ్.


సాక్షిత : షాపూర్ నగర్ పొట్లూరి నాగేశ్వరరావు భవన్ లో కుత్బుల్లాపూర్ మండలం ఆటో యూనియన్ సమావేశం నియోజకవర్గ అధ్యక్షుడు హరినాథ్ అధ్యక్షత వహించగా యూసుఫ్ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ మోడీ ప్రభుత్వం లారీ ట్రక్,ఆటో డ్రైవర్ల కు నష్టం కలిగించే మోటార్ వెహికల్ ఆక్ట్ 2023 ను తీసుకువచ్చి అనుకోకుండా ప్రమాదం జరిగినా మరణం సంభవిస్తే 10 లక్షలు, 7సంవత్సరాల జైల్ శిక్ష తీసుకురావడం అన్యాయమని ఎవ్వరూ కూడా కావాలని ఆక్సిడెంట్ చేయరని కావున వెంటనే ఆ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.రానున్న రోజుల్లో కార్మికులు మరింత సంఘటితమై ఏఐటీయూసీ ఆధ్వర్యంలో పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.

సీపీఐ మేడ్చల్ జిల్లా సహాయ కార్యదర్శి ఉమా మహేష్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ఉచిత మహిళ రవాణా వల్ల ఇబ్బందులకు గురవుతున్న ఆటో డ్రైవర్ లకు ప్రత్యామ్నాయ ఆర్థిక సహకారం అందించి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.ఆటో డ్రైవర్లు ఐక్యంగా ఉండి వారి సమస్యల పరిష్కారం కొరకు ఉద్యమించాలని దానికి సీపీఐ గా సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పారు. *
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏసురత్నం, జిల్లా అధ్యక్షుడు స్వామి లు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నూతన కమిటీ ని 11 మందితో ఎన్నుకోవడం జరిగింది.*
అధ్యక్షుడిగా రాజకుమార్,కార్యదర్శిగా ఎల్లస్వామి, కోశాధికారి గా కుమార్,గోపి,గౌస్,కృష్ణ,జహంగీర్,పూర్ణచందర్, బాలచందర్ ఎన్నికయ్యారు.

Whatsapp Image 2024 01 20 At 4.33.16 Pm

SAKSHITHA NEWS