SAKSHITHA NEWS

ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారు : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మన్నె జీవన్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.చిన్నారెడ్డి మరియు మల్లు రవితో కలిసి మన్నె జీవన్ రెడ్డి రెండు సెట్లు నామినేషన్ పత్రాలు ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారని ఆయన తెలిపారు. టిఆర్ఎస్ పార్టీ బిఆర్ఎస్ గా మారినప్పుడే తెలంగాణతో ఉన్న పేగు బంధం తెగిపోయిందని, ఆనాడు టిఆర్ఎస్ పేరున గెలిచిన నాయకులకు బిఆర్ఎస్ గా మారిన తర్వాత వారు ఆపార్టీలో ఇమడలేక పోతున్నారని, అందుకే వారంతా కాంగ్రేస్ పార్టీకి మద్దతు ఇస్తున్నారని, ఇప్పటికే చాలా మంది బిఆర్ఎస్ నాయకులు కాంగ్రేస్ పార్టీలో చేరారని ఆయన తెలిపారు.


ఇప్పుడున్న పరిస్థితుల్లో బిఆర్ఎస్ పార్టీకి ఎంపి అభ్యర్థులు దొరకడం లేదని, సిటింగ్ లు కూడా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీలో నిలిచేందుకు సుముఖంగా లేరని, కొందరు సిటింగ్ ఎంపిలు కూడా మా కాంగ్రేస్ పార్టీ వైపు చూస్తున్నారని, అంతే కాదు కేసీఆర్ కుటుంబంలోని కొందరు నాయకులు కూడా కాంగ్రేస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నం చేస్తున్నారని ఆయన చెప్పారు.గత ప్రభుత్వం హయాంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు తీవ్ర అన్యాయానికి గురయ్యారని,చేసిన పనులకు కూడా బిల్లులు రాక చెల్లింపులు లేక అనేకమంది ఆర్థికంగా, మానసికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన గుర్తు చేశారు. అందుకే పార్టీలకు అతీతంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు అందరూ కలిసికట్టుగా నేడు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు సిడబ్యుసి ప్రత్యేక ఆహ్వనితులు డా.చల్లా వంశీచంద్ రెడ్డి, మల్లు రవి, చిన్నా రెడ్డి, మైనార్టీ ఫైనాన్స్ కమీషన్ చైర్మెన్ ఒబేదుల్లా కొత్వాల్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి వినోద్ కుమార్, దేవరకద్ర ఎమ్మెల్యే జీ మధుసూదన్ రెడ్డి , మునిసిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్, వైస్ చైర్మన్ షబీర్ అహ్మద్, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రి పట్టణ అధ్యక్షులు లక్ష్మణ్ యాదవ్ పట్టణ కార్యనిర్వాహక అధ్యక్షులు అజ్మత్ అలి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
DOWNLOAD APP

WhatsApp Image 2024 03 11 at 3.56.25 PM

SAKSHITHA NEWS