SAKSHITHA NEWS

WhatsApp Image 2023 07 28 at 3.24.18 PM

కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్
వరద భాదితులకు రూ. యాభై వేల నష్ట పరిహారం ప్రభుత్వంతో మాట్లాడి ఎమ్మెల్యే ఇప్పించాలి


సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం: కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 13 వార్డు ఉమామహేశ్వర కాలనీ, 1 వార్డు లోని అపర్ణ పామ్ గ్రూవ్ మరియు దూలపల్లి లోని వరద ప్రభావిత ప్రాంతాలలో స్థానిక బీజేపీ నాయకులతో కలిసి మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకుడు కూన శ్రీశైలం గౌడ్ పర్యటించారు. ఉమా మహేశ్వర కాలనీ లో వరద నీటిలోనే తిరుగుతూ వరద బాధితులతో మాట్లాడారు. అపర్ణ పామ్ గ్రూవ్ వద్ద పొంగిపొర్లుతున్న వరద నీటిని పరిశీలించారు. దూలపల్లి – కొంపల్లి రోడ్డు లో నత్త నడకన సాగుతున్న కల్వర్టు పనులను పరిశీలించారు.


మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కామెంట్స్..వర్షాలు పడిన ప్రతిసారి ఉమామహేశ్వర కాలనీ ముంపుకు గురవుతుందని తెలిసి కూడా ముందస్తు చర్యలు చేపట్టలేదు.

ఎడతెరిపిలేని వర్షాల వల్ల ఉమామహేశ్వర కాలనీ ముంపుకు గురై ప్రజలు బిక్కుబిక్కుమంటు గడిపినా.. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కనీసం కన్నెత్తి చూడలేదు.
కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద్ తొమ్మిదేళ్లలో ఇక్కడి ముంపు కు శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమయ్యాడు.ఇప్పటికైనా పటిష్టమైన డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసి, సిసి రోడ్ల ఎత్తు పెంచాలి.
తాను ఎమ్మెల్యే గా ఉన్న సమయంలో ఉమామహేశ్వర కాలనీ లో అనేక అభివృద్ధి పనులు చేపట్టాను.
వరదల వల్ల నష్టపోయిన ప్రతి కుటుంబానికి రూ. యాభై వేల నష్ట పరిహారం ప్రభుత్వం నుండి ఇప్పించాలని ఎమ్మెల్యేను డిమాండ్ చేస్తున్నా.


దూలపల్లి కల్వర్టు పనులను త్వరితగతిన పూర్తి చేయాలి.
ఈ కార్యక్రమంలో బీజేపీ కొంపల్లి మున్సిపాలిటీ అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి, బిజెపి నేతలు ఆదిరెడ్డి రాజిరెడ్డి, జీవన్ రెడ్డి శివాజీ రాజా, సతీష్ సాగర్, రాజశేఖర్, సరితారావు, పురుషోత్తం, ఉమామహేశ్వర కాలనీలో వెంకటేష్, వీరేశం, వెంకటయ్య, కుమార్, వరుణ్ రాజ్, సంజయ్, దూలపల్లిలో బిజెపి నేతలు అశోక్, నరసింహ శ్రీనాథ్,దుర్గ, జ్యోతి, శ్రీకాంత్, నర్సింగ రావ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS