SAKSHITHA NEWS

గుండ్రాంపల్లి జాతర ఏర్పాట్లపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే

నార్కట్ పల్లి సాక్షిత ప్రతినిధి

గుండ్రాంపల్లి జాతర ఏర్పాట్లపై నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ నెల 01వ తేదీ నుండి 5వ తేదీ వరకు చిట్యాల మండలంలోని గుండ్రాంపల్లి గ్రామంలో జరిగే శ్రీ ఆదిపరాశక్తి శ్రీ లక్ష్మీదేవమ్మ మరియు బొడ్రాయి సప్తమ వార్షికోత్సవ ఏర్పాట్లపై శుక్రవారం నాడు నార్కట్ పల్లి పట్టణంలో సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఏర్పాట్లను పకడ్బందీగా చెయ్యాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు.
ఈ సమావేశంలో డీఎల్ పి ఓ లక్ష్మినారాయణ, సిఐ శివరాం రెడ్డి,ఎంపీఓ పద్మ, గుండ్రాంపల్లి సర్పంచ్ రత్నం పుష్ప నరసింహ పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS