సకల జనులకు సంపూర్ణ సంక్షేమ ఫలాలు అందించడమే మన ప్రభుత్వ ధ్వేయం: వికారాబాద్ ఎమ్మెల్యే “డాక్టర్ మెతుకు ఆనంద్” *
సాక్షిత : వికారాబాద్ జిల్లా, BRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ కోట్ పల్లి మండలం పరిధిలోని కరీంపూర్ గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
మండలానికి చెందిన లబ్ధిదారులకు మంజూరైన 47 కళ్యాణలక్ష్మి / షాదిముబారక్ చెక్కులు పంపిణీ చేశారు.
కరీంపూర్, ఎన్కెపల్లి, బార్వాద్, కొత్తపల్లి గ్రామాలలో 550 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.
మండల పరిధిలోని మైనారిటీల అభ్యున్నతికి ప్రాధాన్యతను ఇస్తూ… 32 లక్షల అభివృద్ధి పనుల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు.
మహిళా సోదరీమణులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేసి, యువతకు స్పోర్ట్స్ కిట్స్ ను అందజేశారు.
కరీంపూర్ గ్రామంలో 45 లక్షల సీసీ రోడ్లకు మరియు 20 లక్షల నిధులతో నూతన గ్రామపంచాయతీ బిల్డింగ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.