మంత్రుల వ్యాఖ్యలే గందరగోళంగా ఉన్నాయి.
హామీల అమలు ఓ స్త్రీ రేపురా అన్నట్లుంది.
బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మర్రిపెల్లి సత్యమ్..
సాక్షిత ధర్మపురి ప్రతినిది:-
పెగడపెల్లి : రుణమాఫీ లెక్కలపై ప్రభుత్వం స్పష్టత ఇచ్చిన బిజెపి నేతలకు అర్థం కావడం లేదని దీక్షల పేరుతో కొత్త డ్రామాలు ఆడుతున్నారని రైతులను గందరగోళ పరుస్తున్నారని మంత్రులు తుమ్మల నాగేశ్వరావు కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని హామీల అమలుపై మంత్రుల వ్యాఖ్యలు ఓ స్త్రీ రేపు రా అన్నట్లు ఉందని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మర్రిపల్లి సత్యమ్ విమర్శించారు. ప్రభుత్వంలోని మంత్రుల మధ్య సమన్వయం లేక ఒక్కో మంత్రి ఒక్కో మాట మాట్లాడుతూ రుణమాఫీ పై రైతులను గందరగోళపరుస్తున్నారని అన్నారు.
ఒక మంత్రి మొత్తం మంది రైతులకు రుణమాఫీ చేశామంటే మరో మంత్రి సగం సగం మంది రైతులకు రుణమాఫీ అయ్యిందని మిగతా వారికి కూడా త్వరలోనే చేస్తామని ప్రకటన చేయడం మంత్రుల స్థాయి దిగజార్చుకోవడమేనని అధికారంలోకి రావడానికి అడ్డగోలుగా హామీలు ఇచ్చి ఇప్పుడు అమలు చేయమని ప్రజల పక్షాన నిలదీస్తే బిజెపి నేతలపై విమర్శలు చేస్తారా అని ప్రశ్నించారు. రభి పంట కోతకు వచ్చిన ఇంతవరకు రైతు భరోసా ఎందుకు రైతుల ఖాతాలో జమ చేయలేదని కౌలు రైతులకు పన్నెండు వేల రూపాయలు ఎందుకు ఇవ్వలేదని వడ్లకు క్వింటాలకు గత ఖరీఫ్ పంట నుండే 500 బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నవడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తాము అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూ రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు. సన్నరకం వడ్లను వ్యాపారులు మూడువేల పైచిలుకు కొనుగోలు చేస్తే ప్రభుత్వం 2800 చెల్లిస్తే రైతులను ముంచినట్లు అవుతుందా తేల్చినట్లు అవుతుందా ప్రభుత్వంలో ఉన్న మంత్రులు తేల్చుకోవాలని అన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎలాంటి షరతులు లేకుండా రైతులకు రుణమాఫీ చేసి ప్రభుత్వం తన చిత్తశుద్ధిని చాటుకోవాలని డిమాండ్ చేశారు…