The minister who started the farmer’s platform
రైతు వేదిక ను ప్రారంభించిన మంత్రి.
ముఖ్య అతిథిగా క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్
రంగా రెడ్డి సక్షిత ప్రతినిధి
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూఖ్ నగర్ మండల్ ఎలుకట్ట గ్రామంలో ప్రపంచ మృత్తిక దినోత్సవం సందర్భంగా రైతు వేదిక ను ప్రారంభించిన క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్.
మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ అభివృద్ధిలో అన్ని రాష్ట్రాల్లో కన్నా తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉందని ఏ రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు రైతు బీమా, రైతు బంధు, రైతు రుణమాఫీ, ఉచిత కరెంటు, ఆసరా పింఛన్లు, వృద్ధాప్య పింఛన్లు, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, ఇలా ఎన్నో పథకాలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టారని తెలిపారు.
షాద్ నగర్ ఒకప్పుడు ఎలా ఉడేది ఇప్పుడు ఎలా ఉంది. వంద శాతం అభివృద్ధి తెచ్చింది తెలంగాణ ప్రభుత్వమే అని తెలిపారు. లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్టుకు, నీటి సదుపాయం కూడా కల్పిస్తామని తెలిపారు. ఆనంతరం షాద్ నగర్ నియోజకవర్గం హాజీ పల్లి రోడ్ లో నూతనంగా ఏవి కన్వెన్షన్ హాల్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ నరేందర్, వైస్ చైర్మన్ నటరాజ్, సర్పంచ్ సాయిప్రసాద్ యాదవ్, మండల పరిషత్ అధికారులు, గ్రామ సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు.