ఉగాది పర్వదినం సందర్భంగా పాలకుర్తి సోమన్న గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి ఎర్రబెల్లి
పంచాంగ శ్రవణంలో పాల్గొన్న మంత్రి
పాలకుర్తి, మార్చి 22:
జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం కేంద్రంలో గల శ్రీ స్వయంభు సోమేశ్వర లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో ఉగాది పర్వదినం సందర్భంగా రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి, వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు అందించారు. ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దేవస్థానం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పంచాంగ శ్రవణం కార్యక్రమాన్ని ప్రారంభించారు.
మంత్రి ఎర్రబెల్లి కామెంట్స్:
ప్రజలందరికీ తెలుగు సంవత్సరాది ఉగాది శ్రీ శోభకృత్ నామ సంవత్సర శుభాకాంక్షలు!
ఈ ఉగాది ప్రజల జీవితాల్లో మరిన్ని ఉషస్సులు నింపాలి
ఈ ఏడాది శుభప్రదమై ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి
ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా పడి, రాష్ట్రం పాడి పంటలతో, పసిడి కాంతులతో వెలుగొందాలి
సీఎం కెసిఆర్ గారి నేతృత్వంలో తెలంగాణ సస్యశ్యామలమై సంక్షేమ, అభివృద్ధిలో అగ్రగామిగా కొనసాగాలి.
ఇప్పటికే బంగారు తెలంగాణ దిశగా రాష్ట్రం పయనిస్తోంది. దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది
ఈ కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్, సభ్యులు, ఈఓ, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.