కూతురు వద్దని వేడుకున్నా తండ్రిని చంపిన మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్ లో మావోయిస్టులు మరో ఘాతుకానికి పాల్పడ్డారు. బీజేపీలో చేరినందుకు ఓ గ్రామ మాజీ సర్పంచ్‌ను దారుణంగా హత్య చేశారు. తన తండ్రిని వదిలేయాలని సుక్లూ ఫర్సా మైనర్ కుమార్తె సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్ట్ చేసింది. అయినప్పటికీ మావోయిస్టులు సుక్లూ ఫర్సాను దారుణంగా హతమార్చారు. బీజేపీలో ఉంటూ పోలీసుల ఇన్ఫార్మర్గా పని చేస్తున్నాడని సుక్లూపై మావోయిస్టులు అనుమానం పెంచుకున్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.