అర్హులైన నిరుపేదలందరికీ నీడ కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం,
రాష్ట్ర కార్మిక, ఉపాధికల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి,
మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో డబుల్ బెడ్రూమ్ల కేటాయింపు,
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికీ సొంత ఇంటి కల నెరవేర్చాలనే మంచి ఉద్దేశంతో డబుల్ బెడ్రూమ్లను నిర్మించి అర్హులైన నిరుపేదలందరికీ నీడ కల్పించడం జరుగుతుందని ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మంచి ఆలోచన ధోరణితో వీటిని పారదర్శకంగా కేటాయిస్తున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
*మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలోని మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉన్న జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్లో ముషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల సంబంధించి నియోజకవర్గానికి 500 మంది అర్హులైన లబ్ధిదారులకు 1,000 కి రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి
ఆధ్వర్యంలో ముషీరాబాద్, సికింద్రాబాద్ నియోజకవర్గాల లబ్ధిదారులకు 500 చొప్పున 1000 మందికి అలాట్మెంట్ సర్టిఫికెట్లను సైతం అందచేశారు.
ఈ కార్యక్రమంలో GHMC డిప్యూటీ మేయర్ శ్రీ లత శోభన్ రెడ్డి గారు,జవహర్ నగర్ మేయర్ మేకల కావ్య ,డిప్యూటీ మేయర్ ఆర్.ఎస్. శ్రీనివాస్ , దమ్మాయిగూడ మున్సిపాలిటీ ఛైర్పర్సన్ ప్రణిత గౌడ్ , స్థానిక కౌన్సిలర్లు ఆర్డీవో రాజేష్ కుమార్, 12వ డివిజన్ కార్పొరేటర్ Munigala సతీష్ కుమార్ , కార్పొరేటర్స్, కో-ఆప్షన్ మెంబెర్స్, తదితరులు పాల్గొనడం జరిగింది.