ఏఐ ఆధారిత ఆటోమేషన్ కారణంగా వచ్చే ఐదేళ్లల్లో కోట్ల మంది ఉద్యోగాలు కోల్పోనున్నట్టు అడీకో సంస్థ తాజాగా అంచనా వేసింది. తొమ్మది దేశాల్లో 18 రంగాల్లోగల ప్రముఖ సంస్థల టాప్ ఎగ్జిక్యూటివ్‌ల అభిప్రాయాల ఆధారంగా ఓ నివేదిక విడుదల చేసింది. ఏఐ కారణంగా ఉద్యోగుల తొలగింపులు తప్పవని 41 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డట్టు తెలిపింది.
వాస్తవానికి దగ్గరగా ఉండే వీడియోలు, ఇమేజీలు, టెక్స్ట్‌లు సృష్టించడంలో జెనరేటివ్ ఏఐ ఆధారిత టెక్నాలజీలు దూసుకెళుతున్న తరుణంలో… ఈ అసాధారణ టెక్నాలజీతో రోజూవారి పనులు సులభంగా, తక్కువ ఖర్చుతో పూర్తి చేయొచ్చన్న అంచనాలు ఉన్నాయి. దీంతో, ప్రస్తుతం ఉన్న అనేకమంది ఉద్యోగులు సంస్థలకు నిరుపయోగంగా, భారంగా మారనున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.