SAKSHITHA NEWS

సాక్షిత : ఏపీ కేబినెట్‌ కీలక సమావేశం జరుగనుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వెలగపూడి సచివాలయంలో భేటీ జరగనుంది..

ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. సీపీఎస్ రద్దుపై నిర్ణయం తీసుకోనుంది మంత్రిమండలి. సీపీఎస్‌ స్థానంలో కొత్త విధానానికి ఆమోదం తెలపనున్న ఏపీ కేబినెట్‌. పాత పింఛను పథకానికి సమానంగా ఉండే పథకాన్ని తీసుకురానున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత వచ్చే 50% పింఛనుకు తగ్గకుండా.. అలాగే డీఏ క్రమంగా పెరిగేలా ఆలోచన చేయనున్నారు.

పేదలందరికీ ఇళ్లు పథకం కింద చేపట్టిన గృహనిర్మాణ ప్రాజెక్టులను వేగవంతం చేయడం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ఏపీ పునర్విభజన చట్టం కింద పెండింగ్‌లో ఉన్న సమస్యలు, రెవెన్యూ లోటుతో పాటు పోలవరానికి కేంద్ర ప్రభుత్వం నిధులను వేల కోట్ల రూపాయల మేర నిధులను విడుదల చేయడం, ఈ ప్రాజెక్ట్ నిర్మాణ పురోగతి వంటి అంశాలను మంత్రివర్గం చర్చించే అవకాశం ఉంది.

మంత్రివర్గంలో చర్చించాల్సిన అంశాలు, ఆమోదం పొందాల్సిన ప్రతిపాదనలను అందజేయాలంటూ గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి అన్ని శాఖలను ఆదేశించారు. 5వ తేదీ మధ్యాహ్నానికే ఆయా ప్రతిపాదనలన్నీ కూడా సాధారణ పరిపాలన శాఖకు చేరాయి.

WhatsApp Image 2023 06 07 at 12.28.34 PM

SAKSHITHA NEWS