సీపీఐ, సీపీఎం కార్యదర్శులు ఉమా మహేష్, కీలుకాని లక్ష్మణ్.
బహదూరపల్లి లోని డబల్ బెడ్రూంలను నేడు ప్రారంభోత్సవం సందర్భంగా అప్లై చేసుకున్న ప్రతిఒక్కరిని పరిశీలించకుండా కొంతమందికి మాత్రమే కేటాయించడాన్ని నిరసిస్తూ సీపీఐ, సీపీఎం నాయకులు డబల్ బెడ్రూంల ప్రారంభోత్సవం సందర్భంగా ధర్నా నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2 సార్లు ఎన్నికల్లో డబల్ బెడ్రూం ఇస్తా అని చెప్పి ముచ్చటగా మూడోసారి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రజలు ఓట్ల కోసం వెళ్ళినప్పుడు తిరగబడుతారని అనుకోని లక్షల మంది దరఖాస్తు చెలుకుంటే తూతుమంత్రంగా కేవలం 500 మందికి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకోవడం అన్యాయమన్నారు. స్థానికులకు డబల్ బెడ్రూంలను కేటాయించాలని డిమాండ్ చేసారు. పారదర్శకంగా లాటరి పద్ధతిన రూంలు కేటాయిస్తామని చెప్పి ఎవ్వరికి ఎలా కేటాయించారో చెప్పకుండా లబ్ధిదారులను ఎంపిక చెయ్యడం సిగ్గుచేటన్నారు.
దరఖాస్తు చేసుకున్న ప్రతిఒక్కరి దరఖాస్తులను పరిశీలించకుండా వారికి కనిపించిన వారిని మాత్రమే పరిశీలించి హడావుడిగా కేటాయించడం కేవలం ఎన్నికల స్టంట్ అని ఎద్దేవా చేశారు. ఎన్ని జిమ్మికులు చేసిన ఈ సారి ప్రజలు కచ్చితంగా బి ఆర్ ఎస్ ను ప్రజలు ఓడగొడుతారని ఇప్పటికైనా నిజాయితీగా అందరికి ఇచ్చి ఇయ్యనివారికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
రానున్న రోజుల్లో దరఖాస్తు చేసుకున్న ప్రజలను సమీకరించి వామపక్షాల ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉదృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఆందోళన చేస్తున్న సిపిఐ బాచుపల్లి కార్యదర్శి పాలబిందాల శ్రీనివాస్, సీపీఎం నాయకులు అంజయ్య, సీపీఐ మండల కార్యవర్గ సభ్యులు వి.శ్రీనివాస్,ఇమామ్, ప్రభాకర్ లను పోలీసులు అరెస్టు చేసి దుందిగల్ పోలీస్ స్టేషన్కు తరలించారు.