హైదరాబాద్: ఎండల తీవ్రత పెరుగుతోంది. సోమవారం కన్నా మంగళ, బుధవారాల్లో రెండు నుంచి మూడు డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు పెరగనున్నట్లు వాతావరణ శాఖ సూచించింది. దీంతోపాటు రాష్ట్రానికి వడగాలుల ముప్పు పొంచి ఉందని హెచ్చరించింది. ప్రధానంగా బుధవారం కొన్ని జిల్లాల్లో నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. సోమవారం సూర్యుడు నిప్పులుకక్కాడు. రాష్ట్రమంతటా మధ్యాహ్నం సమయంలో తీవ్రమైన వేడితో జనం అల్లాడారు. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి మండలం గరిమెల్లపాడులో 44.2 డిగ్రీల సెల్సియస్ నమోదైంది. ములుగు, నల్గొండ, నిజామాబాద్, పెద్దపల్లి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాల్లో అనేక మండలాల్లో 43 డిగ్రీల పైన నమోదయ్యాయి. హైదరాబాద్ మహానగరం పరిధిలోని పలు ప్రాంతాల్లో 41 డిగ్రీలపైన ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో రహదారులపై జనసంచారం తగ్గింది…….
ఎండల తీవ్రత పెరుగుతోంది
Related Posts
పట్టభద్రుల ఓటర్ నమోదుకు రెండు రోజులే గడువు,
SAKSHITHA NEWS పట్టభద్రుల ఓటర్ నమోదుకు రెండు రోజులే గడువు, ఓటు నమోదుకు ఆసక్తి చూపని పట్టభద్రులు..!! Graduate Mlc: కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మెదక్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికకు సంబంధించి కీలకమైన ఓటరు నమోదు ప్రక్రియ నత్తనడకన సాగుతోంది.…
జనవరి ఫస్ట్ నుంచి టెట్..!!
SAKSHITHA NEWS జనవరి ఫస్ట్ నుంచి టెట్..!! నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విద్యాశాఖజనవరి 20 వరకు ఆన్లైన్లో ఎగ్జామ్స్ఇయ్యాల్టి నుంచి అప్లికేషన్ల ప్రక్రియ షురూహైదరాబాద్ : తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వచ్చే…