SAKSHITHA NEWS

The idols of Sri Siddhi Vinayaka and Dattatreya were installed in full glory

అంగరంగ వైభవంగా శ్రీ సిద్ధి వినాయక మరియు దత్తాత్రేయ విగ్రహలు ప్రతిష్టాపన.

స్వామి వార్లను దర్శించుకున్న రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్


సాక్షిత : ఖమ్మం నగరంలో విజయనగర్ కాలనీ శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గత నాలుగు రోజుల నుంచి కొనసాగించిన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం తో ముగిసింది . మంగళ వాయిద్యాలు , అర్చనలు , దీక్ష హోమాలు , గణపతి పూజలు తో ప్రతిష్టించబడిన శ్రీ సిద్ధి వినాయక మరియు దత్తాత్రేయ స్వామి వార్లను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ దర్శించుకుని స్వామి వార్ల కృపకు పాత్రులయ్యారు .

అనంతరం మహా అన్నదానం కార్యక్రమం నిర్వహించారు . ఈ అన్నదాన కార్యక్రమంలో సుమారుగా 2వేలు నుండి 3వేలు మంది భక్తులు పాల్గొని విజయవంతం చేశారు . ఈ కార్యక్రమంలో నగర మేయర్ పూనకొల్లు నీరజ , సుడా చైర్మన్ బచ్చు విజయకుమార్ మరియు ఆర్ జె సి కృష్ణ , పగడాల నాగరాజు ,

మందిరం చైర్మన్ ఫణిభట్ల రాజలింగయ్య సిద్ధాంతి , వైస్ చైర్మన్ బుద్ధ రామకృష్ణ , సెక్రటరీ పెంట్యాల వెంకట నరసయ్య , జాయింట్ సెక్రెటరీ చండ్ర వీరభద్రరావు , సభ్యులు మండెపూడి కృష్ణయ్య , దొడ్డ నరసింహారావు , భూక్యా బిక్షపతి , స్థానిక కార్పొరేటర్ పైడపల్లి రోహిణి సత్యనారాయణ , మాజీ కార్పొరేటర్ మచ్చ నరేందర్ , ఇంగువ మురళీకృష్ణ శర్మ పాల్గొన్నారు .


SAKSHITHA NEWS