రేవంత్ సర్కారుకు షాక్ ఇచ్చిన హైకోర్టు!
ఇష్టారాజ్యంగా పోలీసులు మొబైల్ ఫోన్లు గుంజుకోవడానికి చెక్!
ప్రొసీజర్ ఫాలో కాకుండా
పోలీసులు ఎవరి మొబైల్ ఫోన్ తీసుకోవడానికి వీల్లేదని తీర్పు
ఎవరైనా పోలీస్ అధికారులు వచ్చి మీ ఫోన్ ఇవ్వాలని బెదిరించినా, బలవంతపెట్టినా సరైన వారంట్ లేకుండా మీ ఫోన్ ఇవ్వమని చెప్పండి.
గత కొంతకాలంగా బీఆర్ఎస్ నాయకుల మీద, కార్యకర్తల మీద ఇష్టారీతిన అక్రమ కేసులు పెడుతున్న రేవంత్ సర్కార్. కక్ష సాధింపు చర్యగా కేసులు పెడుతూ అక్రమ అరెస్టులకు కూడా పాల్పడుతోంది.
అంతే కాదు అలా అరెస్టులకు తెగబడి అరెస్ట్ అయినవారి నుండి అక్రమంగా ఫోన్లు లాక్కుంటున్నారు. ఇది నిజానికి చట్టవిరుద్ధం.
గత రెండు వారాల క్రితం హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డిని ఒక అక్రమ కేసు బనాయించి అరెస్ట్ చేసినప్పుడు కూడా పోలీసులు అదే విధంగా వ్యవహరించారు. కౌషిక్ రెడ్డి ఫోన్‌ను ఆయన అనుమతి లేకుండా బలవంతంగా తీసుకున్నారు.
దీనిపై హైకోర్టులో పాడి కౌషిక్ రెడ్డి వేసిన పిటీషన్‌లో హైకోర్టు చక్కని తీర్పు ఇచ్చింది.
కౌషిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన కేసులో ఆయన మొబైల్ ఫోన్‌కు ఏ సంబంధమూ లేకపోయినా దాన్ని లాక్కోవడం చెల్లదని. బీఎన్ఎస్ఎస్ సెక్షన్ 105 కూడా పోలీసులు ఫాలో కాలేదని. కనుక మొబైల్ ఫోన్ వెంటనే తిరిగి ఆయనకు ఇవ్వాలని హైకోర్టు తీర్పు చెప్పింది.
కోర్టు ఆదేశాలతో పోలీసులు ఆయన ఫోన్ తిరిగి ఇవ్వాల్సి వచ్చింది.