SAKSHITHA NEWS

గుంటూరు ఈస్ట్ ‘ప్రజా శంఖారావం’ ఎన్నికల ప్రచార యాత్రలో డాక్టర్ పెమ్మసాని. ‘ ప్రజా సమస్యలు వింటుంటే గుండె తరుక్కుపోతుంది. 40ఏళ్లుగా నివసిస్తున్నా , ఆ ఇళ్లకు పట్టాలు లేవు. ఆ ఎమ్మేల్యే ఏమో గంజాయి అమ్ముకోవడమే తప్ప ప్రజా సంక్షేమం పట్టదు.’ అని టీడీపీ నాయకులు డా. పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 12,13,14 డివిజన్ల పరిధిలో గల లాల్ తలాఫ్ మసీద్, బారాయిమాం పంజా, సంగటి గుంట, మంత్రి వారి వీధి, ఎల్.ఆర్ కాలనీ తదితర ప్రాంతాల్లో స్థానిక నియోజకవర్గ ఇన్చార్జ్ మసీద్ తో కలిసి కాలినడకన ఆయన పర్యటించారు.

కార్యక్రమంలో భాగంగా పెమ్మసాని మాట్లాడుతూ పదేళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ముస్తఫా ప్రజలకు ఏం చేశారని ఈ సందర్భంగా ప్రశ్నించారు. నాయకులనుంచి ప్రజలేమి మణులు, మాణిక్యాలు కోరుకోరని, శుద్ధి చేసిన నీళ్లు, సజావుగా సాగే డ్రైనేజీ సరఫరా, వీధి దీపాలు వంటివి మాత్రమే కోరుకుంటారన్నారు. క్రమ ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో ఆ సమస్యలను పరిష్కరించే విధంగా అడుగులు వేస్తామని తెలిపారు. కరెంటు చార్జీలు ఎక్కువ ఉన్నాయని, ద్విచక్ర వాహనాలు ఉన్నాయని సాకులు వెతుక్కుంటూన్న ఈ ప్రభుత్వం తమకు సంక్షేమ పథకాలను అందకుండా చేస్తుందని ప్రజలు మావద్ద చెబుతూ వాపోయారని తెలిపారు. ఆ సమస్యకు పరిష్కారంగా చంద్రబాబు ప్రకటించిన సూపర్ సిక్స్ ను ప్రజల్లోకి తీసుకువెళుతూ భవిష్యత్తుపై భరోసాను తాము అందిస్తున్నామని డాక్టర్ పెమ్మసాని స్పష్టం చేశారు. అనంతరం నియోజకవర్గ ఇన్చార్జ్ నసీర్ మాట్లాడుతూ పదేళ్లుగా ఎమ్మెల్యే అయిన ముస్తఫా ఏం పీకుతున్నారని, అడుగడుగునా అవస్థలు కష్టాలతో ప్రజలు ఇబ్బంది పడుతున్న పట్టించుకోవడంలేదని అన్నారు.

వీధుల్లో ఎక్కడ చూసినా మురుగు నిలబడిపోయిన కాలువలు దుర్గంతం వెదజల్లుతున్న సందులతో రోడ్లు దుర్భరంగా ఉన్నాయన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా ప్రజలు ఈ జగన్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ప్రజా శంఖారావంలో భాగంగా మున్సిపల్ కాంప్లెక్స్ అద్దెదారులు, రెడీమేడ్ షాప్స్ హోటల్స్ మెడికల్ షాప్ ఇనుము స్టీల్ కార్మికులు ప్రజలను పెమ్మసాని ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. ప్రతి ఇంటి వద్ద ఆగుతూ వారి వారి సమస్యలను అడిగారు. జగన్ ప్రభుత్వం నుంచి ఎదురవుతున్న సమస్యలను ప్రజల మాటల ద్వారా వివరాలు తెలుసుకున్నారు. ప్రజా శంఖారావంలో భాగంగా వన్ టౌన్ ముస్లిం మేజిస్ట్రేట్ ఎండి ముస్తీ జావేద్ ను పెమ్మసాని కలుసుకొని, కాసేపు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు జాగర్లమూడి శ్రీనివాస్, నగర అధ్యక్షుడు డేగల ప్రభాకర్, డివిజన్ అధ్యక్షులు సయ్యద్ ముజీబ్, ఆరో డివిజన్ కార్పొరేటర్ పోతురాజు సమత, వన్ టౌన్ టీడీపీ మహిళా అధ్యక్షురాలు వజ్జా శ్రీలక్ష్మి, రాష్ట్ర అంగన్వాడీ టీడీపీ అధ్యక్షురాలు వాణీ చౌదరి తదితరులు పాల్గొన్నారు.

*ప్రభుత్వ బాధితులు. 1) 75 ఏళ్లు దాటిన పెన్షన్ ఇవ్వని ప్రభుత్వం – తమ తాతకు 75 ఏళ్లు దాటినా నేటికీ ఈ ప్రభుత్వం పెన్షన్ ఇవ్వలేదు. కారణం ఏంటని అడిగితే అధికారులు నోరెత్తడం లేదు. ఎన్ని సార్లు అడిగినా ఇదే జరుగుతుంది. ఏ ఒక్కరూ సాయం చేయడం లేదు. – జలాలుద్దీన్ కుటుంబీకురాలు. 2) *అన్ని ఇళ్లకూ కలిపి ఒకటే ఇంటి పన్ను. స్థానిక చిన్న బజార్ లోని సుమారు 10-15 ఇళ్లకు కలిపి ఒకటే ఇంటి పన్నును కార్పొరేషన్ అధికారులు కొన్నేళ్లుగా విధిస్తున్నారు. ఎన్ని సార్లు అడిగినా పట్టించుకోవడంలేదని స్ధానికులు డా. పెమ్మసాని వద్ద తమ ఆవేదనను వెళ్లబోసుకున్నారు. 3) రేషన్ వాహనం రాదు, అమ్మఒడి రావట్లేదు*. జగన్ ప్రభుత్వం పంపిస్తామని చెప్పిన రేషన్ వాహనమే కాదు, అమ్మఒడి కూడా అందట్లేదని బాధితులు ప్రజా శంఖారవంలో టీడీపీ నాయకులకు వివరించారు.

WhatsApp Image 2024 03 09 at 6.37.38 PM

SAKSHITHA NEWS