అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వ నష్టపరిహారం చెల్లించాలి
-డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్
సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఏకధాటిగా రెండు రోజులపాటు కురిసిన అకాల వర్షాల వల్ల పంటలు దెబ్బతిని నష్టపోయిన రైతులను నష్ట పరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిసిసిబి డైరెక్టర్ మేకల మల్లిబాబు యాదవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం నాడు దెబ్బతిన్న పంటలను పరిశీలించడానికి వచ్చిన మండల వ్యవసాయ అధికారుల సమక్షంలో మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి, ఆరుగాలం కష్టపడి మిర్చి, మొక్కజొన్న, మామిడి, పొద్దుతిరుగుడు సాగు చేసి పంట ఇంటికి వస్తుందన్న ఆశతో ఉన్న తరుణంలో రెండు రోజులుగా ఏకధాటిగా వర్షాలు కురవడం వలన పంటలు చేతికి రాక రైతులు లబోదిబోమని దుఃఖపడుతున్నారని మల్లి బాబు యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు.
కల్లాలల్లో ఆరబోసిన మిర్చి నీటిపాలైందని, ఈదురు గాలులు, వడగళ్ల వల్ల మామిడి రాలిపోయిందని, మొక్కజొన్న, నేలకు ఒరిగి విరిగిపోయిందని, ఆ విధంగా రైతులు భారీగా నష్టపోయారని, వారికి తక్షణమే ప్రభుత్వం ఎకరానికి 50 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కామేపల్లి మండల వ్యవసాయ అధికారి తారా దేవి, వ్యవసాయ విస్తరణ అధికారి ముని,రైతులు ఉప్పయ్య, సురేష్, బిక్షం తదితరులు పాల్గొన్నారు