The government should immediately support the two families who died due to electric shock
విద్యుత్ షాక్ తో మృతి చెందిన రెండు కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలి – తెదేపా రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్ర ప్రసాద్.
వుయ్యూరు నగర పంచాయతీ 15 వార్డులో విద్యుత్ షాక్ తో మరణించిన ఎడ్లపల్లి రాములమ్మ, ఎడ్లపల్లి రామయ్య కుటుంబాలను పరామర్శించి రెక్కాడితే గాని డొక్కాడని ఆ రెండు కుటుంబాలను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని డిమాండ్ చేసిన రాజేంద్ర ప్రసాద్.
మూడు గంటలసేపు పోలీస్ వారితో మరియు విద్యుత్ డిపార్ట్మెంట్ అధికారులతో నష్టపోయిన రెండు కుటుంబాలకు న్యాయం చేయాలని పోరాడిన రాజేంద్ర ప్రసాద్.
ఈ సందర్భంగా రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ రామయ్య, రాములమ్మ మరణం రెండు కుటుంబాలకి తీరని లోటని, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రెండు నిండు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమైన విషయమని, పేద కుటుంబాలు అయినటువంటి ఆ రెండు కుటుంబాలకి విద్యుత్ శాఖ అధికారులతో మాట్లాడి తే మా డిపార్ట్మెంట్ తరఫున చెరొక ఐదు లక్షలు ఇస్తామన్నారని, ఆడపిల్లలు కలిగిన ఆ రెండు కుటుంబాలకు విద్యుత్ అధికారులు ఇచ్చే డబ్బులు ఎటు సరిపోవు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయలు మరియు రెండు కుటుంబాలకు ఒక్కొక్కరికి చొప్పున గవర్నమెంట్ ఉద్యోగం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన రాజేంద్ర ప్రసాద్.
ఈ కార్యక్రమంలో పెనమలూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి గొట్టిపాటి రామకృష్ణ, తేదేపా బీసీ సాధికార రాష్ట్ర కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్,12వ వార్డు అధ్యక్షులు బూరెలనరేష్, మీసాల అప్పలనాయుడు, కటారి తిరుపతిరావు, శ్యామల రావుమరియు హోలీయ దాసరి సంఘం పెద్దలు పాల్గొన్నారు.