SAKSHITHA NEWS

The government officials were informed but the illegal sand was intoxicated by ordinary people

ప్రభుత్వ అధికారులకు సమాచారం ఇచ్చిన కానీ మామూళ్ల మత్తులో అక్రమ ఇసుక రవాణా పట్టించుకోలేదని గ్రామస్తుల ఆరోపణ*

నవంబర్ 25 సాక్షిత ప్రతినిధి.

వంగూర్ మండలం చింతపల్లి వాగు నుండి రాత్రికి రాత్రే అధికారుల కనుసైగల్లో జోరుగా సాగుతున్న అక్రమ ఇసుక.100 డయల్ కు కాల్ చేసి బండి లొకేషన్ తో పాటు పూర్తి సమాచారం ఇచ్చిన పట్టుకోడానికి విఫలమవుతున్న అధికారులు. అక్రమ ఇసుక రవాణా చేసే టిప్పర్ల యజమానులు అధికారులకు దొరల ఫోజు కొడుతున్నారు.

ఇసుక టిప్పర్లను చూసినా ప్రభుత్వ అధికారులు వాటిని అరికట్టకుండా జోల పాట పాడుతున్నారు.అక్రమ ఇసుక రవాణాలో వంగూరు మండలం అగ్ర గ్రామీ. మచ్చలేని పొలిటికల్ నాయకుల పేర్లు చెప్పుకుంటూ గొప్ప నాయకులకు మచ్చ తెస్తున్న లోకల్ లీడర్లు. అధికారులు రాత్రి తోడేస్తారు పగలు తోలేస్తారు* కాసుల తిరుగుతున్న అక్రమ ఇసుక రవాణా.

భారీ వర్షాలకు వాగుల్లో నీరు ప్రవహిస్తున్న అక్రమ ఇసుక రవాణా మాత్రం ఆగడం లేదు. జెసిబి లతో తవ్వి రవాణా చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకున్నా అధికారులు నాయకుల అండదండలతో రాత్రి పగలు అక్రమ ఇసుక కోసం వాగును జల్లెడలతో నీటిలో నుంచి ఇసుక తీసి సమీపంలో నిల్వ చేసుకుంటున్నారు. రాత్రంతా భారీ యంత్రాలతో నీటిలో నుంచి ఇసుక తీసి సమీపంలో నిలువ చేసుకుంటున్నారు.

పగలు వివిధ ప్రాంతాలకు రవాణా చేస్తూ రూపాయలు లక్షలు గడిస్తున్నారు వాగుల్లో నీరు ఉందని ఇసుక లభించడం లేదంటూ ప్రచారం చేస్తూ అధిక ధరలకు ఒక్క టిప్పర్ ఇసుక 50 వేల నుండి 60000 విక్రయిస్తున్నారు. దుందుభి వాగు పరిసర గ్రామాల నుంచి నిత్యం వందల ట్రాక్టర్ లు పదుల సంఖ్యలో టిప్పర్లు అక్రమ ఇసుక ను తోడేస్తున్నారు.

ఇంత జరుగుతున్న ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ శాఖకు చెందిన అధికారులకు నెలసరి మామూలు మూట చెబుతూ అక్రమ రమణా సాగిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే వంగూరు మండలం ఉల్పర వద్ద వాగులో కల్వకుర్తి మండలంలోని కొందరు వ్యక్తులు రాత్రిపూట పెద్ద యంత్రాలతో ఇసుకను తీసి పరిసరాల ప్రాంతంలో రహస్యంగా డంపింగ్ చేసుకొని మన ఇసుక మన వాహనము అంటూ పట్టపగలే దర్జాగా అక్రమ ఇసుక రవాణా చేస్తున్నారు.

మైనింగ్ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా మేము ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని అలా ఆక్రమణ చేసే వ్యక్తుల పై పోలీస్ శాఖ వారికి సమాచారం ఇస్తామని అంటున్నారు. పగలు రాత్రి అను తేడా లేకుండా టిప్పర్లు. ట్రాక్టర్ల ద్వారా వెల్దండ. కల్వకుర్తి. తో పాటు ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నారు.

కల్వకుర్తి మండలంలోని గుండూర్ శుద్ధకల్. ఎల్లికల్. ఎల్లికట్ట నుంచి పదుల సంఖ్యలో ట్రాక్టర్లు ఇసుకను రవాణా చేస్తున్నాయి.అప్పుడప్పుడు కల్వకుర్తి పోలీసులు చాకచక్యంతో పట్టుబడడం కేసులు నమోదు కావడం జరుగుతుంది. అయినా అక్రమ ఇసుక రవాణా ఆగడం లేదు. నీటిలో నుంచి తీసిన ఇసుక కావడం అధిక లోడుతో మితిమీరిన వేగంతో టిప్పర్లు. ట్రాక్టర్లు వెళ్తుండడంతో బీటీ దారులన్నీ పూర్తిగా దెబ్బతిన్నాయి.

డ్రైవర్లలో అధిక మంది మైనర్లే ఉంటున్నారు. అక్రమ ఇసుక రవాణా చేసే టిప్పర్లు. ట్రాక్టర్ల కు నెంబర్ ప్లేట్లు ఉండడం లేదు. సంబంధిత శాఖ అధికారులు ఎవరూ పట్టించుకోవడం లేదు అక్రమ ఇసుక రవాణాతో ప్రభుత్వం భారీ ఆదాయాన్ని కోల్పోతుంది. అధికారులు స్పందించి అక్రమ రవాణా దారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


SAKSHITHA NEWS