The free mega medical camp is a unique response to the blood donation camp.
ఉచిత మెగా వైద్య శిబిరం రక్తదాన శిబిరానికి విశిష్ట స్పందన.
పల్లా కిరణ్ కుమార్
సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్
ఖమ్మం నగరంలో చర్చి కాంపౌండ్ ప్రాంతంలో పేదల పక్షపాతి , నిరుపేద ప్రజల పెన్నిధి , బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి స్వర్గీయ కీ॥శే॥ శ్రీ పల్లా జాన్ రాములు 84వ జయంతిని పురస్కరించుకొని వారి చిన్న కుమారుడు పల్లా కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం – రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు
. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ప్రముఖ చిన్నపిల్ల డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ మరియు 22వ డివిజన్ కార్పొరేటర్ పల్లా రోజులినా పాల్గొని రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా , కులాలకు అతీతంగా , మతాలకు అతీతంగా పేద నిరుపేద అని తారతమ్యం లేకుండా నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడి వారి కోసం శ్రమించి అందరికి ఆత్మబంధుడై వారి మనలను పొందిన గొప్ప మహాన్యుడు కీశే శ్రీ పల్లా జాన్ రాములు .
అలాంటి వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరం శోచనీయమన్నారు . పల్లా కిరణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఏటలాగానే ఈ సంవత్సరం కూడా వారి జయంతిని ఘనంగా నిర్వహించమని అలాగే వారి పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు జరిపామని వారి ఆశీస్సులు ఎల్లవేళలో నిరుపేద , బడుగు బలహీన వర్గాల ప్రజలపై ఉంటాయని అన్నారు. పల్లా కిరణ్ కుమార్ పిలుపుమేరకు సుమారుగా 60 మంది యూత్ రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారని పేర్కొన్నారు.
తలసీమియా వ్యాధితో బాధపడుతున్న పిల్లల కోసం వారి నుండి రక్తం సేకరించి బ్లడ్ బ్యాంకు కు అందించామని తెలిపారు . ఈ ఉచిత మెగా వైద్య శిబిరాన్ని వృద్ధులు , పిల్లలు , పెద్దలు సుమారుగా 1000 మంది పైగా వినియోగించుకున్నారని తెలిపారు. ఈ వైద శిబిరాన్ని ,రక్త శిబిరాన్ని విజయవంతం చేసినందుకు పేరుపేరునా ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు