ఆరుగాలం శ్రమించి పండించిన ధాన్యాన్ని మార్కెట్ కు తీసుకువచ్చే రైతు చిహ్నం వారిలో స్ఫూర్తిని నింపే విధంగా నిలుస్తుందని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి గారన్నారు.మంగళవారం సుల్తానాబాద్ వ్యవసాయ మార్కెట్లో 10 లక్షల రూపాయలతో అధునాతనంగా నిర్మాణం చేపట్టిన ఎడ్ల బండి రైతు కుటుంబ సభ్యులతో ఉన్న చిహ్నాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు, అనంతరం సింగిల్ విండో వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి మాట్లాడుతూ దేశానికి వెన్నుముక అయినా రైతులు ఆరుగాల శ్రమించి పండించిన ధాన్యాన్ని వ్యవసాయ మార్కెట్లో తీసుకువచ్చి విక్రయిస్తే ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధరలు పొందవచ్చునని తాలు తప్ప తేమ లేకుండా ఆరబెట్టిన ధాన్యాన్ని తీసుకువచ్చే ఏ గ్రేడ్ రకం 2060 బి గ్రేడ్ రకం 2040 మద్దతు ధరను అందిస్తుందని రైతులందరూ విధిగా వ్యవసాయ మార్కెట్ లోనే విక్రయించాలని ప్రభుత్వం కొనుగోలు చేస్తున్న మార్కెట్ తో పాటు ఐకెపి లలో విక్రయించాలని సూచించారు, మధ్య దళారులను నమ్మి మోసపోవద్దని శ్రమించి పండించిన ధాన్యానికి చక్కటి ధరను నిర్ణయించేదని ప్రభుత్వమేనని పేర్కొన్నారు, మార్కెట్ యార్డ్ కు వచ్చే రైతుల కోసం ప్రభుత్వం అన్ని సదుపాయాలను కల్పిస్తుందని వారికి విశ్రాంతి భవనము క్యాంటీన్ మరుగుదొడ్లు మంచినీటి సదుపాయం ఏర్పాటు చేపట్టిందని అలాగే వారి ధాన్యానికి అకాల వర్షం నుండి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు టార్పిండ్లను సిద్ధంగా ఉంచాలని సూచించారు మార్కెట్ యార్డ్ కు వచ్చిన రైతులు ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే వారికి లక్ష ప్రమాద బీమాను అందిస్తుందని అన్నారు అలాగే ఈ సిమ్ కార్డులను హమాలీలు పొందేలా వ్యవసాయ మార్కెట్ కమిటీ కృషి చేయాలన్నారు అలాగే జనరల్ ఇన్సూరెన్స్ చేపడితే ప్రమాదవశాత్తు మరణించిన వారికి నాలుగు లక్షల రూపాయలు పొందవచ్చునని పేర్కొన్నారు, రైతులకు అండగా ప్రభుత్వం ఎప్పుడు నిలుస్తుందని పేర్కొన్నారు రానున్న రోజుల్లో మరిన్ని సదుపాయాలను కల్పించి రైతును రాజును చేసేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు
ఈ కార్యక్రమంలో రైతు బంధు
జిల్లా అధ్యక్షుడు కాసర్ల అనంత రెడ్డి, ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు, జడ్పీటీసీ మినుపాల స్వరూప, మార్కెట్ కమిటీ ఛైర్మెన్ బుర్ర మౌనిక-శ్రీనివాస్,మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత-రమేష్, కే డి సి సి జిల్లా డైరెక్టర్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్, జూపల్లి సందీప్ రావు,మండల పార్టీ అధ్యక్షుడు పురం ప్రేమ్ చందర్ రావు,రైతు సమితి మండలాధ్యక్షుడు రాజ మల్లయ్య,మున్సిపల్ వైస్ పర్సన్ బిరుదు సమత-కృష్ణ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మైపాల్ రెడ్డి,పట్టణ అధ్యక్షులు పారుపల్లి గుణపతి,సూర శ్యామ్,కన్వీనర్ లు మైలారం నారాయణ, భూమేష్, శ్రీనివాస్ రెడ్డి,లంక దాసరి రవి,పట్టణ యూత్ అధ్యక్షుడు వహీద్, కౌన్సిలర్ లు గుర్రాల శ్రీనివాస్, అరుణ-బాపు రావు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బోయిని ముత్యాలు,కుమార్ బాబు, చంద్రయ్య గౌడ్, సంజీవ రెడ్డి,రజని, సర్వర్, రవీందర్ రెడ్డి,ఆంజనేయులు, భాస్కర్ రెడ్డి, సంపత్, నీలయ్య,DMO , సింగిల్ విండో డైరెక్టర్లు కూకట్ల ఓదెలు, పోతర్ల కమలమ్మ, గెల్లు పద్మ, బండ గోపయ్య, ఉస్తేమ్ గణేష్, మానుపాటి పోచమల్లమ్మ, మండలంలోని గ్రామాల సర్పంచులు,ఎంపీటీసీలు, పెద్ద సంఖ్యలో రైతులు మార్కెట్ యార్డ్ సిబ్బంది సహకార సంఘం సిబ్బంది, హమాలీలు బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.