ఉపాధి హామీ పథకం కాపాడాల్సిన బాధ్యత ఉంది
ఉపాధి హామీ పథకం కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి పైన ఉందని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సిర్ల ప్రసాద్ అన్నారు. గురువారం శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.ఉపాధి హామీ పధకం రక్షణ కోసం ఐక్య పోరాటాలు తప్పవని అన్నారు. గతంలో అనేక పోరాటాలు చేసి ఎన్నో దక్కించుకున్నామని ఇప్పుడు మరో పోరాటానికి సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు.