The election will determine the future of Telangana
తెలంగాణ భవిష్యత్ నిర్దేశించే ఎన్నిక
సాక్షిత : ఈ ఉప ఎన్నికలు బిజెపి కుట్రలో భాగంగా వచ్చిన ఎన్నిక
ఈ ఎన్నికల్లో బీజేపీ కొలుకోకుండా ఫలితం ఉండాలి
30న సీఎం సభకు భారీగా తరలి రావాలి.
మునుగోడు ఉపఎన్నిక ప్రచారం లో భాగంగా రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు చండూరు మండలం బోడంగిపర్తిలో శుక్రవారం పార్టీ ముఖ్యనేతలతో సమావేశం అయ్యారు.
బిజెపి కుట్రలో భాగంగా వచ్చిన మునుగోడు ఉప ఎన్నికలో ఓటర్లు కోలుకోలేని విధంగా ఫలితం ఇవ్వాలని మంత్రి కొప్పుల ఈశ్వర్ సూచించారు.
గత 28 రోజులుగా నియోజకవర్గంలో నిర్వహించిన ప్రచారానికి ప్రజల నుంచి మంచి ఆదరణ లభించిందన్నారు, ప్రచార సరళి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సంతోషం వ్యక్తం చేశారన్నారు. రోజుకు రెండు, మూడు సార్లు మానిటర్ చేశారని చెప్పారు.
మునుగోడు ఎన్నిక ఫలితం తెలంగాణ భవిష్యత్తు ముఖ్యంగా టిఆర్ఎస్, బీఆర్ఎస్ ఆధారపడి ఉందన్నారు.
ఈ ఫలితం రానున్న ఎన్నికల పై ప్రభావం ఉంటుందన్నారు,అన్ని వర్గాల ప్రజలు టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు.
సీఎం కేసీఆర్ సభకు బోడంగిపర్తి, శిర్ధేపల్లి. తాస్కానిగూడెం గ్రామాల నుండి వందలాదిగా తరలి రావాలని కోరారు.
ఈ సమావేశంలో టీఆర్ఎస్ నాయకులు గొస్కుల జలందర్, రాజేష్, ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, చిట్టిబాబు, ముత్యాల బలరాం రెడ్డి, లింగమూర్తి, సురేందర్ రావు, కట్కూరు సత్తయ్య, మూగల సత్యం, పడిదం వెంకటేష్, పెద్దూరి భరత్, భాస్కర్, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.