SAKSHITHA NEWS

సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి ఉమా మహేష్.


*సాక్షిత : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నేడు జగతగిరిగుట్ట సీపీఐ కార్యాలయంలో శాఖ కార్యదర్శి సహదేవ్ రెడ్డి అధ్యక్షత జాతీయ పతాకాన్ని సీనియర్ నాయకుడు నారాయణ ఎగురవేయ్యడం జరిగింది.
ఈ కార్యక్రమ ముఖ్యఅతిథి ఉమా మహేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు కేవలం బి ఆర్ ఎస్ కాకుండ యావత్తు తెలంగాణ సమాజం పోరాడిందని కానీ నేడు కేవలం కేసీఆర్, కేటీఆర్ లు బి ఆర్ ఎస్ లు పొరాడినందుకే వచ్చినట్లు వ్యవహరించడం తగదని అన్నారు. నాడు తెలంగాణ వ్యతిరేకులు నేడు తెలంగాణ కాబినెట్ లో ఉండడం సిగ్గుగా ఉందని నేడు ప్రజలు తెలంగాణ కొంతమంది కి మాత్రమే వచ్చిందని బాధపడుతున్నారని అన్నారు. బీజేపీ ,ప్రధాని మోడీ తెలంగాణ ఏర్పాటునే అవమాన పరిచేలా నిండు పార్లిమెంట్ లో మాట్లాడటం మోడీకి తెలంగాణ పై ఉన్న ద్వేషం తెలియచేస్తుందని ఇక్కడి బీజేపీ నాయకులు ముందుగా మోడీ నుండి జవాబు తీసుకొని చెప్పాలన్నారు.

బీజేపీ,టి ఆర్ ఎస్ రెండు కూడా తెలంగాణ ప్రజలు కలలుకన్న నిధులు,నీరు,నియామకాలను,విభజన హామీలను పట్టించుకోకుండా తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నాయని ఇప్పటికే ప్రజలకు అర్థం అయ్యిందని ఇక వారి సమస్యలను పరిష్కరించే బాధ్యత సీపీఐ గా తీసుకోవాలని ప్రజలు ఆశిస్తున్నారని వాటిని సీపీఐ గా అమలు కొరకు పోరాడేందుకు సిద్ధం అని అన్నారు. రాబోవు ఎన్నికల్లో కూడా సీపీఐ మెజారిటీ స్థానాల్లో పోటీచేసి బూర్జువా పార్టీలకు ప్రత్యామ్నాయం సీపీఐ అని భావించేలా పనిచేస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఫ్ కార్యదర్శి వెంకటేష్, ఏఐఎస్ఎఫ్ నాయకులు అరవింద్,సీపీఐ నాయకులు రాజు, నగేష్ చారి, ఖయుమ్, మహబూబ్,నరేందర్,రాములు,శంకర్,మల్లేష్,ముసలయ్య,మోగిలెయ్య తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS