The doors are open and available at any moment
తలుపులు తెరిచే ఉంటాయ్…!
- ఏ క్షణమైనా అందుబాటులో ఉంటా…
- సమస్య ఏదైనా పరిష్కారానికి కృషిచేస్తా…
- బాధిత కుటుంబాలకు పొంగులేటి భరోసా
- కామేపల్లి మండలంలో పర్యటన
- అడగడుగునా నీరాజనం’
: సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:
కామేపల్లి: ఏ కష్టమొచ్చినా… ఏ ఆపదొచ్చినా… సమస్య ఏదైనా సరే..! ఆందోళన చెందావల్సిన అవసరం లేదని… ఆ అవసరాన్ని తనకు తెలియజేస్తే చాలు క్షణాల్లో బాధితుల సమస్యలను పరిష్కారించేందుకు కృషిచేస్తానని తెరాస రాష్ట్ర నాయకులు, ఖమ్మం మాజీ పార్లమెంటు సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు.
ఎల్లప్పుడూ సాయం చేసేందుకు సిద్ధంగా ఉంటానని ఇందుకోసం తన కార్యాలయ తలుపులు నిత్యం తెరిచే ఉంటాయ్ అని ఎప్పుడైనా తలుపుతట్టొచ్చని భరోసా ఇచ్చారు. కామేపల్లి మండలంలో శనివారం పర్యటించిన పొంగులేటి బాధిత కుటుంబాలను పరామర్శిస్తూ నేనున్నానని… మీకేం కాదని అనే నమ్మకాన్ని వారిలో కలిగిస్తూ ముందుకు సాగారు.
పర్యటనలో భాగంగా మండలంలోని జోగ్గుడెం, ఊటుకూరు, కామేపల్లి, రామకృష్ణాపురం, కెప్టెన్ బంజర, మద్దులపల్లి, లల్యాతండా, ముచ్చర్ల, జాస్తిపల్లి, జగన్నాథతండా, మున్సుబ్ బంజర, నారాయణపురం తదితర గ్రామాలను సందర్శించారు. ఆయా గ్రామాల్లో ఇటీవల మృతిచెందిన పలువురు వ్యక్తుల కుటుంబాలను పరామర్శించారు. వివిధ ప్రమాదాల్లో గాయపడిన పలువురిని పరామర్శించి ఓదార్చారు.
అనారోగ్యంతో బాధపడతున్న పలువురి ప్రస్తుత ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు. ఆర్థికసాయాలను కూడా అందజేశారు. పలు శుభ కార్యక్రమాల్లో పాల్గొని పట్టు వస్త్రాలను కానుకగా అందజేశారు. ఆయా గ్రామాల్లోని పలు దేవాలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు
. ప్రతి గ్రామంలోనూ ప్రజలు పొంగులేటికి నీరా‘జనం’ పలికారు. ఘనంగా సన్మానించి పుష్పగుచ్చాలను అందజేశారు. ఈ పర్యటనలో పొంగులేటి వెంట భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ ఛైర్మన్ కోరం కనకయ్య, డీసీసీబీ డైరెక్టర్లు తుళ్లూరి బ్రహ్మయ్య, మేకల మల్లిబాబు యాదవ్, ఎంపీపీ బానోతు సుజాత, వైస్ ఎంపీపీ విజయలక్ష్మి, సర్పంచులు లకావత్ భీమా నాయక్,
మూడు దుర్గాజ్యోతి, అజ్మీర రాందాస్, భగవాన్, జయమ్మ, బానోతు రవి, దేవి, ఎంపీటీసీలు లకావత్ సునీత, జి.గబ్రు నాయక్, నాయకులు విష్ణువర్థన్ రెడ్డి, ఫతే మహ్మద్, శేఖర్ యాదవ్, సాయిరాం నాయక్, బానోతు నరసింహా నాయక్, మూడు కృష్ణాప్రసాద్, లక్ష్మినారాయణ రాజు, బానోతు రాందాస్, పాటిబండ్ల ప్రసాద్, బిక్షపతి తదితరులు ఉన్నారు.