SAKSHITHA NEWS

ఇంటర్‌ మీడియట్‌ పరీక్షల నిర్వహణ సరళిని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ సోమవారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఖమ్మం నగరం రాజేంద్రనగర్‌ ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాల ఇంటర్‌ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ పరిశీలించారు. పరీక్ష కేంద్రంలో కనీస మౌళిక సదుపాయాల కల్పన, ప్రహారీ గోడ భద్రత అంశాలను ఆయన పరిశీలించారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి, ఎండల దృష్ట్యా ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లు, అత్యవసర మందులు అందుబాటులో ఉంచాలన్నారు. సిట్టింగ్‌ స్క్వాడ్‌, ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ వివరాలు అడిగి తెలుసుకున్నారు. చీఫ్‌ సూపరింటెండెంట్‌ తో సహా ఇన్విజిలేటర్లు, పరీక్షా నిర్వహణ విధులకు కేటాయించిన ప్రతి ఒక్కరిని తనిఖీ చేసి, లోనికి అనుమతించాలని, సెల్‌ ఫోన్‌ ను అనుమతించకూడదని కలెక్టర్‌ భద్రతా సిబ్బందిని ఆదేశించారు. ఎలాంటి లోటుపాట్లకు తావు లేకుండా పరీక్షలు సజావుగా జరిగేలా చూడాలని కలెక్టర్‌ అన్నారు. ఈ సందర్భంగా పరీక్ష కేంద్ర చీఫ్‌ సూపరింటెండెంట్‌ , అధికారులు తదితరులు ఉన్నారు.

WhatsApp Image 2024 03 04 at 7.22.49 PM

SAKSHITHA NEWS