టీడీపీ అభ్యర్ధుల ప్రకటనలో జాప్యం పార్టీ శ్రేణుల్లో గందరగోళం రేపుతోంది .. సంక్రాంతి తర్వాత తొలి జాబితా రిలీజ్ చేస్తామని ఫీలర్లు వదిలిన టీడీపీ.. ఇప్పటి వరకు ప్రకటించలేదు.. ఇంతవరకూ బహిరంగ సభల్లో ముగ్గురు అభ్యర్థులనే ప్రకటించారు చంద్రబాబు.. దాంతో అదికూడా అరకులో మాజీమంత్రిని కాదని కొత్త అభ్యర్ధిని ప్రకటించారు .. దాంతోమిగిలిన నియోజకవర్గా ఆశావహుల్లో టెన్షన్ పెరుగుతోంది.. ఎన్నికలకు టైమ్ తక్కువగా ఉండడం .. దాదాపు 50 సీట్లలో ఇద్దరు చొప్పున ఆశావహులు ఉండటం .. మరోవైపు జనసేనకు ఇచ్చే సీట్లేంటో తెలియక గాభరాపడిపోతున్నారు తెలుగు తమ్ముళ్లు.. త్వరగా తేల్చకపోతే నష్టపోతామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు..
మార్పులు చేర్పులంటూ హడావుడి చేస్తున్న వైసీపీ ఇన్స్టాల్మెంట్లుగా ఇన్చార్జ్లను ప్రకటిస్తోంది ..58 అసెంబ్లీ, 10 లోక్సభ స్థానాలకు నాలుగు విడతలుగా కొత్త ఇన్చార్జ్లను ప్రకటించింది అధికార పక్షం.. ఇటు చూస్తే తెలుగుదేశం, జనసేనలు సీట్ల సర్దుబాటు, అభ్యర్ధుల ఖరారంటూ మంతనాలు కొనసాగిస్తున్నాయి కాని ఇంత వరకు కేండెట్ల జాబితా విడుదల చేయలేదు .. రా కదలి రా అంటూ రాష్ట్రవ్యాప్తంగా బహిరంగ సభల్లో పాల్గొంటున్న టీడీపీ అధినేత చంద్రబాబు మాత్రం .. జనసేనతో ప్రమేయం లేకుండా ఆయా వేదికల మీద నుంచి మూడు చోట్ల అభ్యర్ధులను ప్రకటించారు..
గత ఎన్నికల సమయంలో కూడా టీడీపీ అభ్యర్ధుల ప్రకటనలో తీవ్ర జాప్యం జరిగింది.. పార్టీ ఓటమికి అది కూడా ఒక కారణమన్న అభిప్రాయం తెలుగు తమ్ముళ్లలో ఉంది.. అయితే ఈ సారి అలాంటి పొరపాటు జరగదని.. కనీసం ఎన్నికలకు 8 నెలల ముందుగానే కేండెట్లను డిక్లేర్ చేస్తామని చంద్రబాబు అప్పుడెప్పుడో చెప్పారు.. అయితే ఇప్పుడు ఎన్నికల గడువు దగ్గర పడుతున్నా పొత్తుల లెక్కలు వేసుకుంటూనే ఉన్నారు .. జనసేనతో పొత్తు కుదరడంతో సీట్ల సర్దుబాటు తతంగమే ఇంకా పూర్తైనట్లు కనిపించడం లేదు .. దాంతో అభ్యర్ధులను ఎప్పుడు ప్రకటిస్తారనేది పార్టీ శ్రేణులకు అంతుపట్టడం లేదు
అయితే టీడీపీ ముఖ్యులు జాప్యానికి కారణాలు చెప్తున్నారు.. సంక్రాంతి పండుగ అయిపోయిన వెంటనే మొదటిజాబితాను విడుదల చేయాలని చంద్రబాబునాయుడు అనుకున్నారు.. అయినా కుదరలేదంట.. దానికి కారణం ఏమిటంటే టీడీపీ, జనసేనలతో కలిసే విషయంలో బీజేపీ క్లారిటీ ఇవ్వడం లేదని.. ఒక వేళ బీజేపీ పెద్దలు పొత్తుకు ఓకే అంటారేమోనని ఎదురుచూస్తున్నారంట..
టీడీపీ, జనసేనలు పోటీ చేయాల్సిన సీట్లు ఫైనల్ చేసుకుని జాబితాను రిలీజ్ చేశాక .. బీజేపీకి సీట్లు కేటాయించాల్సి వస్తే.. రెండు పార్టీలు కొన్ని సీట్లు వదులుకోవాల్సి ఉంటుంది.. అప్పుడు తాము ప్రకటించిన అభ్యర్ధులను పక్కనపెట్టాల్సి వస్తే … అది నెగిటివ్ ప్రభావం చూపుతుందని చంద్రబాబు, పవన్ కల్యాణ్ భావిస్తున్నారంట.
అదీకాక జనసేనకు ఎన్ని సెగ్మెంట్లు కేటాయించాలి.. ఏ ఏ నియోజకవర్గాలు ఆ పార్టీకి అప్పజెప్పాలన్న దానిపై..చంద్రబాబు తేల్చుకోలేకపోతున్నారన్న టాక్ టీడీపీ కేంద్ర కార్యాలయంలోని తెలుగు తమ్ముళ్ళలో వినిపిస్తోంది.. సంక్రాంతి పండుగ అయిపోగానే 85 మందితో మొదటి జాబితాను విడుదల చేయాలని అనుకున్నారు. ఇందులో టీడీపీ తరపున 70 నియోజకవర్గాలు, మిగిలిన 15 నియోజకవర్గాల్లో జనసేన అభ్యర్ధులుంటారని మొదట అనుకున్నారు.. అయితే సీట్ల సర్దుబాబు, బీజేపీ నిర్ణయం వంటి కారణాలతో జాబితా రిలీజులో లేటవుతోందట. టీడీపీ జాబితాలో సిట్టింగు ఎంఎల్ఏలకే టాప్ ప్రయారిటి ఉండబోతోందని సమాచారం.
అలాగే చాలా చోట్ల టీడీపీ అభ్యర్థుల ఎంపిక పూర్తి చేశారంట.. కానీ అధికారికంగా ప్రకటన రాలేదు.. దాంతో టికెట్ వస్తుందన్న నమ్మకం ఉన్న వారు తమ సెగ్మెంట్లలో ప్రచారం పనిలో పడ్డారు.. మొత్తమ్మీద ప్రతి ఎన్నికల సమయంలో జరుగుతున్నట్లే .. ఈ సారి అభ్యర్ధుల ప్రకటన ఆలస్యమవుతుండటంతో టీడీపీ నేతల్లో అసహనం పెరిగిపోతోందట.