ఈ నెల తేది: 25-11-2024 సోమవారం రోజున ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్ లో జరిగే బిసిల సమరభేరి కార్యక్రమానికి మన బిసి కులసంఘాల నాయకులు, బిసి సోదరులందరూ పెద్దఎత్తున తరలివచ్చి సమరభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాము. ………
ఈ రోజు జగిత్యాల జిల్లా కేంద్రంలో జరిగిన బిసి సంక్షేమ సంఘం సమావేశంలో బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మినారాయణ మాట్లాడుతూ
ఈ నెల తేది: 25-11-2024 సోమవారం రోజున ఉదయం 10 గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్ లో జరిగే బిసి ల సమరభేరి కార్యక్రమానికి మన బిసి కులసంఘాల నాయకులు, బిసి సోదరులందరూ పెద్దఎత్తున తరలివచ్చి సమరభేరి కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని కోరుతున్నాము. ఇట్టి కార్యక్రమంలో కులగణన సర్వే పకడ్బందీగా చేపట్టి, కులగణనలో జణగణన కార్యక్రమాన్ని వెంటనే చేపట్టి బీసీ లకు రిజర్వేషన్లు పెంచి కాంగ్రెస్ ప్రభుత్వం తమ చిత్తశుద్దిని నిరూపించుకోవాలని, రాష్ట్ర ప్రభుత్వం బడుగు, బలహీన వర్గాలకు విద్య, ఉపాధి, రాజకీయ రంగాల్లో సరైన ప్రాధాన్యం కల్పించాలని, సమాజంలో అంతరాలను రూపుమాపడానికి, బలహీనవర్గాలను మరింత పైకి తీసుకురావడానికి ఈ ప్రభుత్వాలు కృషి చేయాలని, ముఖ్యంగా పార్లమెంటులో బీసీ బిల్లు ప్రవేశపెట్టి చట్టసభల్లో బీసీలకు రాజకీయరంగాల్లో 50 శాతం రిజర్వేషన్లు పెంచాలని, దేశంలో అణగారిన కులాలను అణచివేసే దోరణి కొనసాగుతుందని, అధికారంలో బీసీలకు వాటా ఇవ్వకపోవడమే దీనికి నిదర్శనమన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేల్లయినా కేంద్రంలో బీసీ లకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ లేకపోవడం దురదృష్టకరమన్నారు.
మహిళా బిల్లులో బీసీ మహిళల కోటా, ప్రభుత్వ ఉద్యోగాల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేసి, స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు పెంచకు…… ఇప్పటికైనా అసెంబ్లీలో కులగణన బిల్లు ప్రవేశపెట్టి, చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. కులగణనలో దేశానికి ఆదర్శంగా నిలిచిన బీహార్ రాష్ట్రాన్ని మోడల్ గా తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. అవసరమైతే కులగణన విధివిధానాల కోసం ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని అన్నారు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేసేలా బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు వచ్చేలా కుల సంఘాలన్నీ ఏకతాటి మీదిగా ఉండి పని చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, బి.సి యువజన సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ తిరుపురం రాంచందర్, బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు దండుగుల వంశీ, బి.సి మహిళా సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శి రాచకొండ రోజా (న్యాయవాది), బిసి సంక్షేమ సంఘం సాంస్కృతిక కార్యదర్శి బొమ్మిడి నరేష్ కుమార్, నియోజకవర్గ అధ్యక్షురాలు బండపెల్లి మల్లీశ్వరి, బిసి సంక్షేమ సంఘం పట్టణాధ్యక్షుడు రాపర్తి రవి, బి.సి సంక్షేమ సంఘం మండలాధ్యక్షుడు గుంటి గంగారాం, యూత్ కో-ఆర్డినేటర్ హృషికేష్, బిసి నాయకులు తదితరులు పాల్గొన్నారు.