సాక్షిత : భారత రాజ్యాంగ సృష్టి కర్త , మేధావి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి,భారత రాజ్యంగ నిర్మాత, ఆర్థిక వేత్త ,న్యాయ కోవిందుడు, రాజనీతిజ్ఞుడు, ప్రపంచ మేధావి భారత రత్న . డా. బి.ఆర్ అంబేద్కర్ 132 వ జయంతి సందర్భంగా ఆ మహానియుడిని స్మరించుకుంటు హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని హైదర్ నగర్ ప్రధాన రహదారిపై కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు ఆధ్వర్యంలో డా.బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ తో కలిసి పూల మాల వేసి ఘన నివాళులు అర్పించి జయంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు మాట్లడుతూ రాజ్యాంగ నిర్మాతగా దేశ గమనాన్ని మార్చడంలో డా.బి.ఆర్.అంబేడ్కర్ పోషించిన పాత్ర చిరస్మరణీయమని నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు. అంబేడ్కర్ 132వ జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకున్నారు. ఎంతటి కష్టమైన పనైనా చిత్తశుద్ధితో, పట్టుదలతో ప్రయత్నిస్తే సాధించలేనిది ఏదీ లేదని అంబేడ్కర్ జీవితం నేర్పిస్తుందని అన్నారు. కుల వివక్ష ఎదుర్కొన్నా ఎక్కడా వెనకడుగు వేయలేదని, ఆయన రచనలు ప్రపంచాన్ని ఆలోచింపచేశాయని,దేశానికి దశ ,దిశ చూపిన మహానుభావుడు అని అలాంటి మహానుభావుడి ని స్మరించుకుంటు హైదర్ నగర్ లో జయంతి ఉత్సవాలు జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయం అని , ప్రతి ఒక్కరు ఆనందించదగ్గ విషయం అని, ఆయనను స్ఫూర్తి గా తీసుకొని ఆయన ఆశయాల బాటలో ప్రతి ఒక్కరు ప్రయాణించాలని ఎంతోమందికి ఆయన జీవితం స్ఫూర్తిదాయకం అని నార్నె శ్రీనివాస రావు పేర్కొన్నారు
.అదే విధంగా ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో మన తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ 125 అడుగుల భారీ విగ్రహం ఈరోజు ఆవిష్కరణ చేసుకోవడం హరించదగ్గ విషయమని అదేవిధంగా దేశంలో ఎక్కడ లేని విధంగా దళిత బంధు పథకం ద్వారా దళితుల అభివృద్ధి కి కృషి చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన కేసీఆర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో హైదర్ నగర్ డివిజన్ అధ్యక్షులు దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షులు పోతుల రాజేందర్, రాగా ప్రసాద్, దళిత నాయకులు దానయ్య, బాలయ్య, మాధవి, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు అష్రాఫ్, సైదేశ్వర్ రావు, ఖదీర్, నక్క శ్రీనివాస్, సిందం శ్రీకాంత్, మహిళ నాయకురాలు ప్రమీల, విమల, స్వప్న, లత, మరియు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వెల్ఫేర్ అసోసియేషన్ సోదర సోదరీమణులు, మరియు స్థానిక కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.