SAKSHITHA NEWS

మత్స్యకారుల సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ….

హనుమకొండ జిల్లా….

దివి:-08-10-2024….

హాసన్ పర్తి మండల కేంద్రము లోని పెద్ద చెరువులో మంగళవారం రోజున ముదిరాజ్ కులస్తులు గ్రామ ప్రజలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, అధికారులతో కలిసి హాసన్ పర్తి చెరువులో 80 వేల పిల్లలకు గాను తొలివిడతగా 40వేల చేప పిల్లలను చెరువులో వదిలివేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు చేప పిల్లలను చెరువులో వదిలారు…..

హాసన్పర్తి మత్స్యకారులసంఘం వారు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు గారిని శాలువాతో సత్కరించడం జరిగింది…..

ఈ సందర్భంగా వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ..

చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఒక పండుగలా జరుపుతున్నదని అన్నారు.

ముదిరాజ్ కులస్తులను అన్ని రంగాల్లో ముందుకు తీసుకుపోవడానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి చేస్తున్నదని అన్నారు.

గత పాలకులు ప్రచార ఆర్భాటం తప్ప మత్స్యకారులను ఆదుకున్నది ఏమీ లేదని అన్నారు

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేక కార్య చరణతో చేపల పెంపకాన్ని ప్రోత్సహిస్తూ మత్స్యకారుల సంక్షేమానికి పాటుపడుతున్నాదని అన్నారు.

దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న చెరువులో చేపలను పెంచడానికి చేప పిల్లలను ప్రభుత్వం పూర్తి సబ్సిడీతో పంపిణీ చేస్తున్నదని అన్నారు.

అధిక మొత్తంలో చేపలు పెంపకం చేయడానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో చేప పిల్లలను పంపించడం జరుగుతుందని అన్నారు.

మత్స్యకారులు ప్రత్యేక శ్రద్ధతో చెరువులలో కుంటలలో చేపల పెంపకం చేయాలని, పెరిగిన చేపలను అమ్మకం చేసి మత్స్యకారులు ఆర్థికంగా బలోపితం కావాలని కోరారు.

చేపల వేట కోసం వెళ్లిన మృత్యువాత పడిన మత్స్యకారులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటున్నదని అన్నారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు మాజీ ప్రజా ప్రతినిధులు మత్యశాఖ అధికారులు మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు, ముదిరాజ్ కులస్తులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

WhatsApp Image 2024 10 08 at 2.12.55 PM

SAKSHITHA NEWS