బేడీలు వేసి & అరెస్ట్ లు చేసి రైతన్నలను క్షోభకి గురి చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
*సాక్షిత :BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఇచ్చిన పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అధ్యక్షతన వికారాబాద్ మునిసిపల్ పరిధిలోని రైల్వే స్టేషన్ సర్కిల్ లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం సమర్పించారు.
వినతి పత్రంలో భాగంగా లగచర్ల రైతులపై అక్రమంగా కేసులు పెట్టి, అనేక ఆంక్షలు విధించి, గుండె నొప్పితో బాధపడుతున్న సరే బేడీలు వేసి మరి అరెస్ట్ లు చేసి, జైళ్లలో వేసి ఆపై శారీరకంగా వారిపై దాడి చేసి, థర్డ్ డిగ్రీ ప్రయోగించిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వ ఆగడాలని ఇకనైనా ఆపాలని, అలాగే రైతన్నలపై నమోదు చేసిన అక్రమ కేసులను ఎత్తివేసి, వారిని వెంటనే విడుదల చేయాలని BRS పార్టీ తరపున మరియు రైతుల పక్షాన కోరడమైనది.
మాజీ బీసీ కమీషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, మాజీ ZP వైస్ చైర్మన్ విజయ్ కుమార్, BRS పార్టీ పట్టణ అధ్యక్షులు ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు అనంత్ రెడ్డి, గోపాల్, రామస్వామి, కృష్ణ, సీనియర్ నాయకులు మేక చంద్రశేఖర్ రెడ్డి, PACS వైస్ చైర్మన్ పాండు, మైనారిటీ నాయకులు ఘాయాజ్, గఫ్ఫార్ నాయకులు మహిపాల్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, సత్యయ్య గౌడ్, అశోక్ మాజీ కౌన్సిలర్ లక్ష్మన్, ర్. మల్లేశం, మంచన్ పల్లి సురేష్, రాజేందర్ గౌడ్, కృష్ణ, గాండ్ల మల్లికార్జున్, సంగమేష్, శ్రీనివాస్ గౌడ్, సుభాష్, మంగలి రవి, మహిపాల్, సిద్ధూ్లూర్ శ్రీనివాస్, ఉపేందర్ రెడ్డి, జైపాల్ తదితరులు పాల్గొన్నారు.
వికారాబాద్ నియోజకవర్గ కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో, గ్రామల్లో గల డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహాలకి వినతి పత్రాలు అందజేసిన BRS పార్టీ నాయకులు.