SAKSHITHA NEWS

పదో తరగతి పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలి.

  • జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్

సాక్షిత ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:

పదో తరగతి పరీక్షల నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. మంగళవారం కలెక్టర్ స్థానిక నిర్మల్ హృదయ్ హైస్కూల్, ఎన్.ఎస్.సి. కాలనీ ప్రభుత్వ హైస్కూల్ లలో ఏర్పాటు చేసిన పదో తరగతి పరీక్షా కేంద్రాలను ఆకస్మిక తనిఖీలు చేశారు. పరీక్షల నిర్వహణకు కల్పించిన మౌళిక వసతులు పరిశీలించారు. విద్యార్థులు పరీక్షా వ్రాయు విధానము, సరళిని పరిశీలించారు. పరీక్ష కు హాజరైన విద్యార్థుల వివరాలను చీఫ్ సూపరింటెండెంట్ లను అడిగి తెలుసుకున్నారు. మాస్‌ కాపీయింగ్‌ జరుగకుండా పర్యవేక్షించాలని ఇన్విజిలెటర్స్ ను ఆదేశించారు. పరీక్షా హాలులో నిరంతర విద్యుత్‌ సరఫరా, ఫ్యాన్లు, వెలుతురు ఉండాలని, త్రాగునీరు అందుబాటులో ఉంచాలన్నారు. పరీక్ష కేంద్రంలో ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు, సెల్‌ఫోన్‌ అనుమతించరాదని, సమీపంలో ఎటువంటి జీరాక్స్‌ సెంటర్లు ఉండరాదని, 144 సెక్షన్‌ పటిష్టంగా అమలు చేయాలని కలెక్టర్‌ సూచించారు. పరీక్షా కేంద్రంలోకి చీఫ్ సూపరింటెండెంట్ తో సహా ఎవ్వరికీ సెల్ ఫోన్ అనుమతి లేదని, ఇది ఖచ్చితంగా అమలు చేయాలని అన్నారు. వైద్య శిబిరాన్ని పరిశీలించి, వేసవి దృష్ట్యా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని, ఓఆర్ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని అన్నారు. సిట్టింగ్ స్క్వాడ్ అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి తప్పిదాలు జరగకుండా చూడాలని అన్నారు.

 కలెక్టర్ తనిఖీ సందర్భంగా జిల్లా విద్యాధికారి సోమశేఖరశర్మ, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

SAKSHITHA NEWS