SAKSHITHA NEWS

మియాపూర్ లోని శ్రీ చైతన్య పాఠశాల లో జరిగిన శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్ పర్సన్ శ్రీమతి డాక్టర్ ఝాన్సీ లక్ష్మీ బాయి జన్మదినం సందర్భంగా చైతన్య ఎడ్యుకేషనల్ ట్రస్ట్ & దుర్గాబాయి దేశ్ ముఖ్ బ్లడ్ సెంటర్ సంయుక్తంగా నిర్వహించిన మెగా రక్తదాన శిబిరంను శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ నాగేందర్ రావు , GM రవి కుమార్ , సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి తో కలిసి పాల్గొని ప్రారంభించిన PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శ్రీ చైతన్య విద్యాసంస్థల చైర్ పర్సన్ శ్రీమతి డాక్టర్ ఝాన్సీ లక్ష్మీ బాయి జన్మదినం సందర్భంగా మహా రక్త దానం శిబిరం నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం అని, ఇది శుభపరిణామం అని, అనంతరం రక్తదాన శిబిరాన్ని ప్రారంభించి, కార్యక్రమంలో పాల్గొని రక్తదానం చేసిన వారికి ప్రత్యేక అభినందనలు తెలియజేసి, సర్టిఫికెట్లను అందజేశారు. స్వచ్ఛంధంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా సంతోషకరమైన విషయం అని, మంచి స్పందన వచ్చినది అని ,అన్ని దానంల కన్నా రక్తదానం గొప్పది అని, ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యత గా తప్పనిసరిగా రక్తదానం చేయాలని, నిండు ప్రాణాలను కాపాడినవారు అవుతారు అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారి ఇతర ప్రాణాలు కాపాడిన దైవ సమానులు అవుతారు అని కావున ప్రతి ఒక్కరు స్వచ్ఛంద గా ముందుకు వచ్చి రక్తదానం చేయాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.

ఈ కార్యక్రమంలో శ్రీ చైతన్య విద్యాసంస్థల డీన్ లు సురేందర్ బాబు, శంకర్ రావు, శ్రీనివాస రావు, AGMలు రాంబాబు, హరి, మాధవ్, చంటి సీనియర్ నాయకులు రఘునాథ్ రెడ్డి ,ప్రసాద్, సందీప్ రెడ్డి,యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS