SAKSHITHA NEWS

The CCTV that caught Ketugal is on Sri Balaji Hospital

కేటుగాళ్లను పట్టిచ్చిన సీసీ టీవీ శ్రీ బాలాజీ హాస్పిటల్ పై

తప్పుడు ఫిర్యాదు దారునిపై కోర్టు సీరియస్

కేసు నమోదుకు న్యాయస్థానం ఆదేశం.

సాక్షిత ఖమ్మం బ్యూరో చీఫ్:

అతి తెలివితో, అక్రమంగా ఒక ప్రయివేటు వైద్యునిపై తప్పుడు ఫిర్యాదు చేసి మూడో నేత్రం సీసీ కెమెరా కంటికి అడ్డంగా దొరికిపోయి ఎట్టకేలకు తప్పు ఒప్పుకుని అరెస్టయిన ఇద్దరు. వ్యక్తులకు సంబంధించిన ఉదంతమిది. కాస్తంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనలో ఎదుటి వారిని బురిడీ కొట్టించాలని చూసి నిఘా నేత్రం సీసీ కెమెరా కంటికి చిక్కిన కేటుగాళ్లు ఎట్టకేలకు న్యాయస్థానం ముందు నిందితులుగా నిలబడాల్సిన పరిస్థితి దాపురించింది.

ప్రజల ప్రాణాలను కాపాడే వైద్యులను సమాజంలో చులకన చేసేలా ప్రయత్నించి చివరికి చేసిన పాపం : బట్టబయలు కావడంతో తప్పు ఒప్పుకోక తప్పలేదు. ఇదే క్రమంలో అరెస్టయి న్యాయస్థానం ఎదులు ఎక్కవచ్చి పోయి నేరం అంగీకరించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంతకూ ఏమిటా తప్పుడు కేసు, అక్రమానికి సంకెళ్ళు ఎలా పడ్డాయి… న్యాయం ఎలా గెలిచిందో తెలుసుకోవాలంటే ఈ కథనం ఒక్కసారి చదవాల్సిందే… ఆదుకున్న వైద్యునిపై అక్రమంగా ఫిర్యాదు..

ఖమ్మం నగరంలోని పాత సీపీఎం కార్యాలయం సమీపంలో శ్రీ బాలాజీ చెస్ట్, డయాబెటీస్ హాస్పిటలు కొనేళ్లుగా ప్రముఖ చాతీ వైద్యనిపుణులు డా. గుగులోత్ శ్యామ్ కుమార్ నిర్వహిస్తున్నారు. వైద్య రంగంలో తనకంటూ ఒక ప్రత్యేకతను చాటుకుంటూ పల్మనాలజీ వైద్యంతో పాటు, డయాబెటిస్ పేషెంట్లకు నాణ్యమైన వైద్య సేవలు అందిస్తున్నారు.

ఈ క్రమంలోనే కోవిడ్ మెదటి దశలో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్న సమయంలో కరోనా వ్యాధికి ఉత్తమ వైద్యం అందించే వైద్యునిగా పేరున్న డా. శ్యామకుమార్ హాస్పిటల్కు 2021 ఏప్రిల్ చివరి వారంలో ఖమ్మం రూరల్ మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఎం. భద్రయ్య అనే పేషెంట్ను అతని కుమారుడు, బావమరిది. తీసుకొచ్చారు.

అప్పటికే వేరే ప్రయివేటు హాస్పిటల్లో కొద్దిరోజుల పాటు చికిత్స అందించి, తగ్గకపోవడంతో కరోనా వ్యాధితో నీరసంగా ఉన్న భద్రయ్యను రాత్రి 11గంటల సమయంలో హాస్పిటల్లో చేర్చారు. రోగిని పరిశీలించిన డా. శ్యామ్ కుమార్ రోగి పరిస్థితి కాస్త ఆందోళన కరంగా ఉందని తెలిపారు. దీనికి రోగి తరపు బంధువులు డా. శ్యామకుమార్ను బతిమాలి ఎలాగైనా చేర్చుకోవాలని పట్టుపట్టారు. అందుకు గాను రోగి పరిస్థితి మరింత విషమించినా, దినయినా పర్వాలేదంటూ ముందు ట్రీట్ మెంట్ స్టార్ట్ చేయాలంటూ డాక్టర్ను బతిమాలారు. వాళ్ల పరిస్థితి చూసిన డా. శ్యామ్ కుమార్ మానవత్వంతో పేషెంట్ను ఇన్ పేషెంట్ చేర్చుకుని వైద్యం స్టార్ట్ చేశారు.

రోగికి కరోనా పరీక్షలు నిర్వహించి వెంటనే రెమిడిసీవర్ ఇంజక్షన్ కావాలంటూ స్లీప్ రాసి బయట తెచ్చుకోవాలని డాక్టర్ చెప్పారు. దీనికి గాను రోగి కుమారుడు నందీప్, బావమరిది కల్యాణ్ ఇద్దరూ బయట వేరే చోట రేమిడిసీవర్(అప్పుడే మార్కెట్లో కొత్తగా వచ్చిన పౌడర్ బెస్ట్)ఇంజక్షన్ తెచ్చుకున్నారు.

వారు తెచ్చుకున్న ఇంజక్షను హాస్పిటల్ సిబ్బంది. వారి సమక్షంలోనే రోగికి ఇంజక్షన్ చేశారు. ఆ తర్వాత రోగి క్రమక్రమంగా కోలుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో రోగి తరపు బంధువులు భద్రయ్యకు వెంటిలేటర్ కావాలంటూ డాక్టరు అడిగారు, అందుకు వైద్యుడు వెంటిలేటర్ అవసరం లేదనీ, పల్స్, హార్ట్ బీట్, సాచ్యురేషన్ బాగానే ఉన్నాయని చెప్పడంతో అయినా సరే ఎందుకైనా మంచిది.

వెంటిలేటర్ పెట్టాల్సిందేనని ఒత్తిడి చేశారు. డాక్టర్ వద్దని చెప్పినా విభేధించారు. గుట్టుచప్పుడు కాకుండా పేషెంట్ తప్పించి అడ్డంగా దొరికిన వైనం… వెంటిలేటర్ కావాలని పట్టుబట్టి డాక్టర్ వద్దని చెప్పడంతో వేరే హాస్పిటలు తీసుకెళ్లేందుకు రోగి బంధువులు సందీప్, కల్యాణ్ ఇద్దరూ ఒక పథకం ప్రకారం హాస్పిటల్ సిబ్బంది. మధ్యాహ్నం భోజనానికి వెళ్లిన సమయంలో రోగిని, రోగితో పాటు కేస్ షీట్ను తీసుకుని హాస్పిటల్ బిల్లుకూడా! చెల్లించకుండా ఖమ్మంలోని వేరే హాస్పిటల్కు తీసుకెళ్లారు.

ఆ సమయంలో సదరు పేషెంట్ ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఆక్సీజన్, వేరే వ్యక్తుల సపోర్ట్ కోర్టు ముందు ప్రవేశ పెట్టిన పోలీసులు లేకుండా బెడ్ దగ్గరనుండి హాస్పిటల్ బయటకు ఆరోగ్యంగా నడిచి వెళ్లిన దృశ్యాలు సీసీ టీవీ ఫుటేజీలో రికార్డయ్యాయి.

అనంతరం వేరే హాస్పిటల్లో వారం రోజుల పాటు చికిత్స పొంది పరిస్థితి విషమించి 2021 మే 5వ తేదీన మృతిచెందాడు. చనిపోయిన రెండు వారాలకు పి ఎస్ తప్పుడు ఫిర్యాదు.. తమ బంధువు హాస్పిటల్ నిర్లక్ష్యం వల్లనే చనిపోయాడంటూ రోగి తరువు బంధువులు అతను చనిపోయిన రెండు వారాలకు ఖమ్మంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్లో డా. శ్యామకుమార్, అతని సిబ్బందిపై ఫిర్యాదు చేశారు.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి డా. శ్యామ్కుమార్, అతని సిబ్బంది ఇద్దరిని అరెస్టుచేసి రిమాండ్ చేశారు. ఇలా జైలులో వారం రోజుల పాటు మానసిక వేదన అనుభవించి, చెయ్యని నేరానికి శిక్ష అనుభవిస్తూ ముగ్గురూ నిద్రలేని రాత్రులు గడుపుతూ సమాజం. దృష్టిలో ద్రోహులుగా చిత్రీకరించబడ్డారు.


SAKSHITHA NEWS