తీన్మార్ మల్లన్న పై పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలి………………………………………
బిజెపికి బీసీలు హిందువుల కనపడట్లేదా…………
విద్య, ఉపాధికి దూరమైన బీసీలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని డిమాండ్
బి సి ఎఫ్ చేస్తున్న పోరాటానికి ప్రతి ఇంటి నుండి ఒక యువత కదలిరావాలని పిలుపు
బిసిఎఫ్ రాష్ట్ర కన్వీనర్ ఎన్ చెన్న రాములు ముదిరాజ్
…..
సాక్షిత వనపర్తి :
ఇటీవల తీన్మార్ మల్లన్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ పై మాట్లాడినందుకు రెడ్డి జాగృతి కి చెందిన రెడ్డి సోదరులు తీన్మార్ మల్లన్న పై పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడాన్ని బీసీఎఫ్ రాష్ట్ర కన్వీనర్ నాగనమోని చెన్నారాములు తీవ్రంగా ఖండించారు జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తెలంగాణలో 6.30% ఉన్న ఓసి అగ్రకులాలు ఈడబ్ల్యూఎస్ పేరు మీద 10% రిజర్వేషన్ అనుభవిస్తూ బీసీలకు అన్యాయం చేస్తున్న విషయంపై తీన్మార్ మల్లన్న చేస్తున్న న్యాయపోరాటానికి బి సి ఎఫ్ సంపూర్ణ మద్దతునిస్తున్నది. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర కులాల గణన జరిపి బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ హామీ అమలు చేయాలని బీ.సీ.ఎఫ్ డిమాండ్ చేస్తుందని చెన్న రాములు ముదిరాజ్ అన్నారు. తరతరాలుగా చేతివృత్తులను నమ్ముకొని జీవిస్తున్న బీసీ కులాల ప్రజలు విద్యకు ఉపాధికి దూరంగా పేదరికంలో దారిద్ర రేఖకు దిగువన జీవిస్తున్నారు కాబట్టి బి.సి.కార్పొరేషన్ ఏర్పాటు చేసి సబ్సిడీ రుణాలు మంజూరు చేసి చేయూతనివ్వాలని . పార్లమెంటులో వెంటనే బిల్లు పెట్టి బీసీలకు జనాభా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్లు అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు . కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణన చేయకపోవడాన్ని బిజెపి ప్రభుత్వాన్ని చెన్న రాములు ముదిరాజ్ తప్పు పట్టారు . బీసీలు హిందువులు కారా ? బీసీలకు బిజెపి న్యాయం చేయదా ? అని ఆయన ప్రశ్నించారు. ఈనాటికీ గ్రామీణ ప్రాంతాల్లో బీసీలకు భూమి లేనందు భూమిలేని ప్రతి బీసీ కుటుంబానికి మూడు ఎకరాల భూమి పంపిణీ చేయాలని బీసీలకు జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయించి విద్యా ఉద్యోగ ఉపాధి రంగాలలో ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు రాజ్యాంగ విరుద్ధంగా ఏర్పాటుచేసిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను బోగస్ రిజర్వేషన్లుగా ఉపయోగించుకుంటూ నిజమైన లబ్ధిదారులకు అన్యాయం జరుగుతున్నది కాబట్టి వెంటనే సమగ్ర విచారణ జరిపి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను దుర్వినియోగం చేస్తున్న వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకోవాలని ఈడబ్ల్యూఎస్ ను జనాభా దామాషా ప్రకారం అమలు చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు తమ డిమాండ్లు పరిష్కరించకుంటే బీసీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలను చేపడతామని ఆయన ప్రభుత్వాలను హెచ్చరించారు బీసీలు న్యాయం కోసం చేస్తున్న పోరాటంలో ప్రతి ఇంటికొక బీసీ యువకుడు కదలి రావాలని ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని రాజ్యాధికారం సాధించుకునే వరకు పోరాటంలో పాల్గొనాలని ఆయన బీసీలకు పిలుపునిచ్చారు .బి.సి. ఉద్యోగులు , మేధావులు బి.సి.ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరారు . ఏం.బి.సి.లకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ పత్రిక సమావేశంలో జిల్లా అధ్యక్షులు గుంటి కురుమూర్తి, ప్రధాన కార్యదర్శి తిరుపతయ్య యాదవ్ ,రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గన్నోజు రవికుమార్ చారి కె .వెంకటేశ్వర్లు ,మరియు జిల్లా మహిళా అధ్యక్షురాలు జానంపేట లీలావతి బి సి ఎస్ ఎఫ్ విద్యార్థి విభాగం రాష్ట్ర నాయకుడు సుభాష్ చంద్ర వనపర్తి పట్టణ బి.సి.ఎఫ్ అధ్యక్షులు ఉందేకోటి అంజి తదితరులు పాల్గొన్నారు.