
మంత్రి వర్యులు సీతక్క పై Ntv లో కథనం అర్థరహితం
నిత్యం ప్రజల మధ్య ఉండే మంత్రి సీతక్క పై Ntv అక్కసు వెల్లుపుచుకోవడం బాధాకరం
జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్
ములుగు
రాష్ట్రం నలుమూలల తిరుగుతూ ఇటు ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొంటూ నియోజకవర్గం లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడుతూ కార్యకర్తలతో సమావేశాలు నిర్వహిస్తూ నిత్యం ప్రజల మధ్య ఉంటూ పని చేస్తున్న రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మరియు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ దనసరి అనసూయ సీతక్క పై ntv కథనం చాలా బాధాకరం అని జిల్లా గ్రంథాలయ చైర్మన్ బానోత్ రవి చందర్ అన్నారు
జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ ఆదేశాల మేరకు ములుగు జిల్లా కేంద్రములో ఏర్పాటు చేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి పక్షములో ఉన్న ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రజల మధ్య ఉంటూ సంక్షేమ పథకాలను ప్రజలకు అందించడానికి నిరంతరం కృషి చేస్తున్న మంత్రి సీతక్క గారి తప్పడు కథనాలు ప్రచారం చేస్తున్న ntv చానెల్ పై పిర్యాదు చేస్తామని శిలాఫలకాల కూల్చిన వ్యక్తులు ఎవ్వరో ntv తెలిస్తే మాకు ఇవ్వాలని మా కార్యకర్తలు క్రమ శిక్షణ కలిగిన నాయకులు 10 ఏండ్లు అధికారము లేకపోయిన మంత్రి సీతక్క వెంట ఉన్నాం ఉంటాం కూడా రాష్ట్ర మంత్రిగా రాష్ట్రం మొత్తం తిరగక తప్పదు ఆయన వారానికి మూడు,నాలుగు రోజులు ములుగు నియోజక వర్గంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశాలు ఏర్పాటు చేసి కార్యకర్తల కష్టాలు తెలుసుకొని మాకు అన్ని విధాలుగా చూసుకుంటున్నారు కొంత మంది దుర్మార్గులు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు ఇలాంటి ప్రయత్నాలు మానుకోవాలని ఆయన అన్నారు శిలాఫలకలు
కూల్చడం ముమ్మాటికి బిఆర్ఎస్ పని అని మా కార్యకర్తలు ఇలాంటివి చెయ్యరనీ శిలాఫలకలు కూల్చిన దుండగులను గుర్తించాలని అదే విధంగా తప్పుడు కథనాలు చేసిన ntv చానెల్ యాజమాన్యం మంత్రి సీతక్క కి క్షేమపన చెప్పాలని ఆయన డిమాండు చేశారు
ఈ కార్యక్రమంలోములుగు మండల పార్టీ అధ్యక్షుడు ఎండీ చాంద్ పాషా,బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు వంగ రవి యాదవ్,మండల పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నల్లెల్ల భరత్ కుమార్, PACS చైర్మన్ చిక్కుల రాములు,మాజీ ఎంపీటీసీ తిరుపతి రెడ్డి, ఇమ్మడి రాజు యాదవ్,మాజీ ఉప సర్పంచ్ ఎల్లవుల అశోక్, ఎస్సీ సెల్ మండల అధ్యక్షుడు మట్టేవాడ తిరుపతి,సీనియర్ నాయకులు శంకర్ గారి,పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అభినయ్ చారి, సీనియర్ నాయకులు ఓడ రాజు ,మండల బీసీ సెల్ అధ్యక్షుడు ఓం ప్రకాష్ ,మైనారిటీ నాయకులు షకీల్ అహ్మద్, ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఓరుగంటి అనిల్,పట్టణ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు బోడ సతీష్,నాయకులు కుమార్ యాదవ్,జిల్లా నాయకులు రాజు,మండల పార్టీ ఉపాధ్యక్షుడు అర్షం రఘు,యూత్ నాయకులు ప్రశాంత్,తో పాటు తదితరులు పాల్గొన్నారు
