The aim is to develop a single person who has all the qualifications for an MLA in all fields
ఎమ్మెల్యేకు అన్ని అర్హతలు ఉన్న ఏకైక వ్యక్తి అన్ని రంగాలలో అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్న సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి.
విద్య, వైద్యం, ఉపాధి లక్ష్యంగా ముందుకు సాగుతున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి.
సాక్షిత ప్రతినిధి. : కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు సేవ చేసే భాగ్యం అందరికీ రాదని తనకు దక్కినందుకు గౌరవంగా భావిస్తున్నానని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి అన్నారు. వందల కోట్లు ఉన్నవారు సైతం కష్టాల్లో ఉన్న వారికి సహాయం చేయరు. వంద ఎకరాల భూములు కార్పొరేట్ స్థాయి పరిశ్రమలు ఎన్ని ఉన్నా తమ వరకే పరిమితంగా ఉంటారు.
ప్రజాసేవ చేయాలన్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి వంటి వారు సమాజంలో కొందరే ఉంటారు. కల్వకుర్తి నియోజకవర్గం లో ఐక్యత ఫౌండేషన్ ద్వారా వారు చేస్తున్న సహాయం ప్రజాప్రతినిధులను నివ్వెర పరుస్తున్నాయి. ఉన్నత చదువులు చదివి సంపాదించిన డబ్బులో కొంత ప్రజా సేవకు ఉపయోగించడం ఆనందంగా ఉందంటున్నారు సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి. కష్టపడి ఉన్నత చదువులు చదివారు.
ఉద్యోగరీత్యా అమెరికాకి వెళ్ళారు కొన్ని సంవత్సరాలుగా అక్కడే ఉండి పలు కంపెనీలను నిర్వహించాడు. కోట్లు సంపాదించిన సొంత గడ్డకు సేవ చేయడంలో ఉన్న తృప్తి ఎందులో ఉండదని సొంత గడ్డకు వచ్చారు. ఇక్కడి సమాజాన్ని పరిశీలించారు. మనిషికి ఎంత డబ్బు ఇచ్చినా ఉపయోగం లేదు అని గమనించారు.
అందుకే విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలను కల్పించాలని అనుకున్నారు. పేదలకు విద్య అందిస్తే వారు ఉన్నత శిఖరాలకు ఎదుగుతారు అందుకే బడుగు బలహీన వర్గాల పిల్లలకు ఉన్నత చదువులు చదవడానికి ఫీజులు కట్టడానికి లేకపోయినా సుంకిరెడ్డి రాఘవేందర్‌రెడ్డి సొంత ఖర్చులతో విద్యను పేద విద్యార్థులకు అందేలా చేశాడు. అందుకే సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రభుత్వ పాఠశాలలలో మౌలిక వసతులు ఏర్పాటుకు శ్రీకారం చుట్టాడు.
శుద్ధ జలాలు పంపిణీ ,బాత్రూం లు, మరుగుదొడ్లు, విద్యుత్ సౌకర్యం, ఫ్యాన్లు తదితర వాటిని పాఠశాలలకు సమకూర్చాడు. మెడిసిన్, ఇంజనీరింగ్ కళాశాలలకు వెళ్లే విద్యార్థులు పేద విద్యార్థులు అయితే వారికి ఆర్థిక సహాయం తనవంతుగా అందిస్తున్నాడు. నూతనంగా ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ జాబులకు వెళ్లేవారికి ఉచితంగా శిక్షణ డ్రెస్ కోడ్ లు వంటివి బూట్లు, టీ షర్ట్స్ అందిస్తున్నాడు.
“తన సొంత డబ్బులతో కోట్లతో గ్రామాల అభివృద్ధి కోసం నిరంతర కృషి”
స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన నేటికీ గ్రామాల రూపురేఖలు మారలేదు. తెలంగాణ వచ్చి 8 ఏళ్లు అయినా స్వరాష్ట్రం అభివృద్ధికి నోచుకోలేదు. అందుకే సిసి రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచడానికి తన వంతు సహకారం అందిస్తున్నాడు. దేవాలయాల నిర్మాణంతోపాటు శిథిలమైన వాటిని పునర్నిర్మాణానికి చేయూత ఇస్తున్నాడు. గండి వీడు మండలం చౌదర్పల్లిలో నూతనంగా ఐదు కోట్ల రూపాయలతో హనుమాన్ దేవాలయం నిర్మిస్తున్నాడు అంటే అతని పట్టుదల ఏ పాటిదో మనకు తెలుస్తుంది.
కల్వకుర్తి నియోజకవర్గం లో సైతం దేవాలయాల పునరుద్ధరణ చేపడుతున్నాడు సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి. కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోలేని పేద ప్రజలు అనేకమంది ఉన్నారు. అందుకే ప్రభుత్వ ఆసుపత్రులను బలోపేతం చేయాలి అని ఆయన ఆకాంక్షిస్తున్నారు. అందుకే గతంలోనే చౌదర్పల్లిలో ఆయన సొంత ఖర్చులతో ఆస్పత్రి నిర్వహిస్తున్నాడు.
ప్రతి గ్రామంలో ఒక ప్రాథమిక ఆసుపత్రి ఉంటే పేద ప్రజలకు వైద్యం అందుతుంది అని వారు ఆకాంక్షిస్తున్నారు. వైద్యం ఉచితంగా అందిస్తే పేద ప్రజలకు ఎటువంటి ఖర్చులు ఉండవు అని రాఘవేందర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉపాధి రంగాలపై ఆయన దృష్టి సారించారు విద్య, వైద్యo తోపాటు ఉపాధి లేకుండా యువత మనుగడ సాధించలేదు అన్నది ఆయన అభిప్రాయం, అందుకే ప్రభుత్వాలు యువతకు ఉపాధి కల్పించే దిశగా పని చేయాలి అని ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిఅంటున్నాడు. తన చేతుల మీదుగా అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించాడు. ఐక్యత ఫౌండేషన్ ద్వారా జరుగుతున్న అనేక కార్యక్రమాలకు యువతను స్వచ్ఛంద సేవ చేయిస్తూ వారికి అండగా నిలుస్తున్నాడు.
“ప్రత్యక్షరాజకీయాలలోకి సుంకి రెడ్డి రాఘవేందర్ రెడ్డి వస్తే”
సంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి ఐక్యతను ఫౌండేషన్ ద్వారా పరిమితంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. విస్తృతంగా సేవలు చేయాలి అంటే ప్రభుత్వ ప్రజాప్రతినిధులుగా ఉండాలి అప్పుడే భారీ స్థాయిలో సంక్షేమ పథకాలు అమలు చేయవచ్చు. ముఖ్యంగా ప్రాజెక్టులు
,జాతీయ రహదారులు డబుల్ బెడ్ రూములు కులవృత్తులను చేయూత వ్యవసాయ రంగానికి సబ్సిడీలు వంటివి అందాలి అంటే తప్పనిసరిగా ఎమ్మెల్యేగా గెలవాలి. అప్పుడే ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది. అందుకే ప్రజా ప్రతినిధిగా సామాజిక సేవ చేస్తున్న ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డిని కల్వకుర్తి ఎమ్మెల్యేగా గెలిపించాలని కల్వకుర్తి కల్వకుర్తి నియోజకవర్గం ప్రాంత ప్రజలు కోరుతున్నారు.