TG TET: నవంబర్ 7 నుంచి టెట్ అప్లికేషన్లు..!!
హైదరాబాద్ : తెలంగాణ స్టేట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టీజీ టెట్) ఆన్లైన్అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభంకానున్నది. షెడ్యూల్ ప్రకారం..
ప్రారంభం కావాల్సిన దరఖాస్తుల ప్రక్రియ.. టెక్నికల్ ఇష్యూస్ కారణంగా7వ తేదీకి వాయిదా పడింది. ఇన్ఫర్మేషన్ బులిటెన్, డిటెయిల్డ్ నోటిఫికేషన్ https://schooledu.telangana.gov.in/ISMS వెబ్ సైట్లో పెడ్తామని టెట్ కన్వీనర్, ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ జి.రమేశ్ తెలిపారు.
స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు సోమవారం టెట్ 2024 నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. జనవరి 1 నుంచి 20 వరకు ఆన్లైన్ లో టెట్ పరీక్షలు నిర్వహిస్తామని షెడ్యూల్ ప్రకటించారు. అయితే, అప్లికేషన్ ఫీజు విషయం పేర్కొనలేదు. మే నెలలో నిర్వహించిన టెట్ ఎగ్జామ్ క్వాలిఫై కాకపోతే తర్వాత నిర్వహించే టెట్లో ఉచితంగానే అప్లై చేసుకునే ఛాన్స్ ఇస్తామని సర్కారు గతంలో ప్రకటించింది. దీనిపై సర్కారు పెద్దలతో విద్యాశాఖ అధికారులు ఇంకా మాట్లాడకపోవడంతోనే, ఈ ప్రక్రియ ఆగిపోయినట్టు తెలుస్తోంది.