SAKSHITHA NEWS

33 జిల్లా కేంద్రాల్లో టెట్టు పరీక్ష కేంద్రం ఏర్పాటు చేయాలి÷డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు షేక్ బషీరుద్దీన్…

ఖమ్మం, మార్చి 27, 2024….
టెట్ దరఖాస్తు ఫీజు ని తగ్గించాలని లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తావని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ బషీరుద్దీన్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు..
స్థానిక సుందరయ్య భవనంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు శీలం వీరబాబు అధ్యక్షతన జరిగిన డివైఎఫ్ఐ ముఖ్య నాయకులు మరియు టెట్ అభ్యర్థుల సమావేశంలో షేక్ బషీరుద్దీన్ మాట్లాడుతూ టేట్టు దరఖాస్తు ఫీజులు పెంచడం ఈ ప్రభుత్వానికి సరైనది కాదు అని గత ప్రభుత్వం చేసిన తప్పులను మళ్ళీ ఈ ప్రభుత్వం చేయవద్దు అని బషీరుద్దీన్ అన్నారు. గత ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో ఆటలు ఆడిందని దానికి తగిన మూల్యం చెల్లించిందని ఆయన అన్నారు. ఈ ప్రభుత్వం అధికారం రాకముందు యూత్ డిక్లరేషన్ పేరుతో యువతను ఆశల మత్తులో ఉంచిందని, ముఖ్యంగా ఉద్యోగ నోటిఫికేషన్ల విషయంలో గత ప్రభుత్వం మాదిరిన వ్యవహరిస్తుందని ఇది సరైనది కాదు మార్చుకోవాలని హితవు పలికారు.

అనేక ఆశలతో నిరుద్యోగులు యువత కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటు వేశారని అధికారంలోకి వచ్చిన తర్వాత హామీల విషయం మర్చిపోవద్దని ఆయన అన్నారు. ముఖ్యంగా నోటిఫికేషన్ల దరఖాస్తు ధరలు తగ్గిస్తామని ప్రకటించారని ఇప్పుడు పెంచడం ఏమిటి అని ప్రశ్నించారు. గతంలో టెట్ పరీక్షకు సంబంధించి 300 రూపాయలు ఉండేదని ఇప్పుడు దాన్ని ఒక పరీక్షకు ₹1000 చేశారని రెండు పరీక్షలు కలిపి రూ 2000 అవుతుందని ఈ దరఖాస్తు ఫీజు కట్టడం నిరుద్యోగులకు భారంగా మారుతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం దరఖాస్తు ఫీజులు గత ప్రభుత్వం కంటే తగ్గించాలని లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని అని సందర్భంగా అన్నారు.

తెలంగాణలో ఉన్న నిరుద్యోగులు ఈ ప్రభుత్వా నా ఉద్యోగాలు కల్పిస్తుందని ఆశిస్తూ ఉన్నారని, నిరుద్యోగులు హాస్టల్స్ లో గ్రంథాలయాలలో, రూములు వద్దకు తీసుకొని చదువులు సాగిస్తున్నారని, ఒక పూట భోజనం చేసి రెండు పూటలు భోజనం చేయకుండా, పుస్తెలతాడు అభిమాని పిల్లలను చదివిస్తున్నారని ఆయన సందర్భంగా గుర్తు చేశారు. ఇట్లాంటి సందర్భంలో దరఖాస్తు ఫీజులు పెంచుకోవాలని నిరుద్యోగులు అనేక ఇబ్బందులకు గురి అవకాశం ఉందని ఆయన అన్నారు. దీంతోపాటుగా పెట్టు నిర్వహణ సెంటర్లు కూడా పెంచాలని ప్రతి జిల్లాకు కనీసం ఒక సెంటర్ ఇవ్వాలని 33 జిల్లాలకు 33 సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లాలోని చోట రెండు సెంటర్లు ఇస్తే అభ్యర్థులకు ప్రయాణ ఖర్చులు మిగిలే అవకాశం ఉంటుందని ఆయన గుర్తు చేశారు.
టెట్ అభ్యర్థులు డివైఎఫ్ఐ ఆఫీస్ కి వచ్చి వారిని కలిసినట్టు ఈ సందర్భంగా ఆయన వివరించారు. ఫీజు తగ్గించకపోతే రాష్ట్రవ్యాప్తంగా టెట్ అభ్యర్థులను కలుపుకొని ఇతర వామపక్ష యువజన,విద్యార్థుల సంఘాలు కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
ఈ సమావేశంలో డివైఎఫ్ఐ జిల్లా నాయకులు కూరపాటి శ్రీను, జక్కంపూడి కృష్ణ, సాయి రాజేష్, హుస్సేన్ రావు, రమణ, కళ్యాణి ,పద్మ, సుమతి, నాగరాజు, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Image 2024 03 27 at 3.49.18 PM

SAKSHITHA NEWS