SAKSHITHA NEWS

పోటీ నుంచి తప్పుకున్న పది మంది అభ్యర్ధులు

నల్గొండ జిల్లా: మునుగోడు ఉప ఎన్నికల బరి నుంచి పదిమంది అభ్యర్ధులు నామినేషన్ ను విరమించుకున్నారు. చండూరు 2,3 వార్డుల ఇంఛార్జ్‌గా పనిచేస్తున్న రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చొరవతీసుకుని అభ్యర్ధులతో మాట్లాడి,వాళ్ల సమస్యలు విన్నారు. వారికి అండగా ఉంటామని పార్టీ పరంగా సీఎం కేసీఆర్,పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి తగిన గుర్తింపు గౌరవం దక్కేలా చూస్తామని ఎర్రబెల్లి హామీ ఇచ్చారు. దీంతో వారు ఎన్నికల బరి నుంచి తప్పుకుంటున్నామని ప్రకటించారు. అంతేగాక మునుగోడులో టిఆర్ఎస్ అభ్యర్థిగా నిలిచిన ప్రభాకర్ రెడ్డి విజయం కోసం పనిచేస్తామని ప్రకటించారు.
పోటీ నుంచి విరమించుకున్న అభ్యర్థుల వివరాలు:
◆కేయూ జేఏసీ అధ్యక్షుడు ఆంగోత్ వినోద్ కుమార్
◆వార్డ్ మెంబర్ భూక్య సారయ్య
◆నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాలోత్ వెంకన్న
◆ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర కార్యదర్శి తేజావత్ రవీందర్
◆గిరిజన రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర ఉపాధ్యక్షులు మాలోత్ నరేందర్
◆నిరుద్యోగ జేఏసీ కేయూ ఇన్చార్జి భూక్య బాలాజీ
◆ప్రజాసేన పార్టీ అధ్యక్షులు బానోతు ప్రేమ్ లాల్
◆కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారుడు జన్ను భరత్
◆కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారుడు జన్ను తిరుపతి
◆విద్యార్ది నాయకుడు చందర్
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ మునుగోడు ఉప ఎన్నికల బరిలో నుంచి విరమించుకున్న అభ్యర్థులను అభినందించారు.
బీజేపీ స్వార్థపూరిత రాజకీయాలకు పరాకాష్టగా ఈ మునుగోడు ఉప ఎన్నిక వచ్చిందని ఆరోపించారు.బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని ఓడించి మునుగోడు ప్రజల ఆత్మగౌరవం గెలిపించాల్సిన బాధ్యత మునుగోడు ఓటర్లపై ఉందన్నారు.


SAKSHITHA NEWS